iDreamPost
android-app
ios-app

క‌మ‌ల్ సినిమాలో ర‌జ‌నీకాంత్‌? మణిరత్నం పెద్ద ప్లాన్ వేశాడు!

  • Author Soma Sekhar Published - 07:59 PM, Thu - 17 August 23
  • Author Soma Sekhar Published - 07:59 PM, Thu - 17 August 23
క‌మ‌ల్ సినిమాలో ర‌జ‌నీకాంత్‌? మణిరత్నం పెద్ద ప్లాన్ వేశాడు!

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా నడుస్తోంది. సీనియర్ హీరోల సరసన యంగ్ హీరోలను కొంతమంది డైరెక్టర్లు తీసుకుంటే.. ఇద్దరు సీనియర్ హీరోలతో భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారు దర్శకులు. తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ క్రేజీ మల్టీస్టారర్ కు ప్లాన్ చేశాడట సీనియర్ దర్శకుడు మణిరత్నం. ఈ వార్త ప్రస్తుతం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడు ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.

మణిరత్నం.. ఇండియన్ సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాను ప్రేక్షకులకు అందించి అగ్రదర్శకుడిగా ఎదిగాడు. ఇక ప్రేమ కథలను హృదయానికి హత్తుకునేలా తీయడంలో మణిరత్నం ప్రత్యేక శైలి. ఆయన టేకింగ్ కు స్పెషల్ గా ఓ ఫ్యాన్ బేస్ ఉందంటేనే అర్ధం చేసుకోవచ్చు. అయితే ఏజ్ ముదురుతుండటంతో మణిరత్నం సినిమాలు చేయకపోవచ్చు అనే టాక్ ఈ మధ్య కోలీవుడ్ లో గట్టిగానే వినిపించింది. అదీకాక పొన్నియిన్ సెల్వన్ మూవీ అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో.. ఈ వార్తలకు ఇంకాస్త బలం చేకూర్చినట్లుగా అయ్యింది.

కాగా.. ఈ వార్తలకు చెక్ పెడుతూ ఇంకో హాట్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీలో కీలక పాత్ర కోసం రజినీకాంత్ ను నటింపజేయాలనే ఉద్దేశంతో ఉన్నడట మణిరత్నం. ఇక అందుకు సంబంధించిన ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నాడని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇద్దరు లెజెండరీ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే రికార్డులు బద్దలే అంటున్నారు అభిమానులు.

ఇక కమల్ తో ‘నాయకుడు’ రజినీకాంత్ తో ‘దళపతి’ సినిమాలను తెరకెక్కించాడు మణిరత్నం. ఈ రెండు సినిమాలు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ మైలు రాయిగా నిలిచాయి. మరి అలాంటి ఈ ఇద్దరితో సినిమాను చేయడానికి సిద్దం అవుతున్నాడట ఈ దిగ్గజ దర్శకుడు. అయితే రజినీ-కమల్ కలిసి నటించకూడదని చాలా క్రితమే అనుకున్నారు. అయితే మణిరత్నం లాంటి దర్శకుడు అడిగితే వీరిద్దరు మాత్రం ఎలా కాదంటారు? అంటున్నారు నెటిజన్లు. కాగా.. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ తో ఓ దిగ్గజ దర్శకుడు సినిమా చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: OTTలోకి ‘బేబి’ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet