iDreamPost

OTTలోకి ‘బేబి’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

  • Author Soma Sekhar Updated - 05:38 PM, Fri - 18 August 23
  • Author Soma Sekhar Updated - 05:38 PM, Fri - 18 August 23
OTTలోకి ‘బేబి’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. దీనికి ఉదాహరణ ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించింది ‘బేబీ’ మూవీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రానికి సాయిరాజేష్ దర్శకత్వం వహించాడు. తొలి రోజు నుంచే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో.. భారీ వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు దాదాపుగా ఈ మూవీ రూ. 90 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. కాగా.. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం బేబీ ఓటీటీ అప్ డేట్ వచ్చేసింది. మరి బేబీ ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బేబీ.. గత కొన్ని రోజులగా టాలీవుడ్ లో ఎక్కువగా వినిపించిన పేరు. రికార్డు కలెక్షన్లతో కేజీఎఫ్ లాంటి సినిమాలనే వెనక్కి నెట్టి ఔరా అనిపించింది బేబీ మూవీ. వరుసగా పదవ రోజు కూడా రూ. కోటి వసూల్ చేసి పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ మూవీ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఇక థియేటర్లలో ఈ మూవీని చూడటం మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. ప్రముఖ ఓటీటీ అప్డేట్ ఇచ్చింది. బేబీ మూవీ తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ‘ఆహా’ ట్వీట్ చేసింది. ఆగస్టు 25 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది ఆహా యాజమాన్యం. కాగా.. ఆహా గోల్డ్ సభ్యత్వం ఉన్న వారు ఈ మూవీని 12 గంటల ముందే చూడోచ్చని తెలిపింది. ఇక ఈ మూవీ ఇప్పటి వరకు సుమారు రూ. 90 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది.


ఇదికూడా చదవండి: అతడిని ఛాన్స్ అడిగితే.. అడ్జస్ట్ మెంట్ కోరాడు: రెజీనా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి