Dharani
Dharani
ఆంధ్రప్రదేశ్‌లో మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. పేదలకు అండగా నిలస్తూ.. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ.. జనాల మదిలో చెరగని అభిమానాన్ని సంపాదించుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేలు.. ఏపీలో మరోసారి అధికారంలోకి రాబోయేడి జగనే అని తేల్చి చెప్పాయి. విపక్షాలు ఎంత విషప్రచారం చేసినా.. జనాలు మాత్రం తమ ఓటు జగన్‌కే అంటున్నారు. అధికార పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం టీడీపీకి చెందిన కీలక నేతలు.. వైసీపీలో చేరగా.. తాజాగా జనసేన ముఖ్య నేత ఒకరు అధికార పార్టీలో చేరారు. ఆ వివరాలు..
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. జనసేన నేత రాయపురెడ్డి ప్రసాద్ అలియాస్ చిన్నా.. వైసీపీలో చేరారు. చిన్నాకు కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్. రాయపురెడ్డి ప్రసాద్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరడంతో.. జనసేన నేతలు షాక్‌లో ఉన్నారు.
రాయపురెడ్డి చిన్న రాకతో వైఎస్సార్ సీపీకి మరింత బలపడిందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్. గత 30 ఏళ్ళుగా తమ తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు వెన్నెంటి ఉన్న రాయపురెడ్డి చిన్న.. తాజాగా మళ్లీ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత భారీ మెజార్టీతో రాజానగరంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.