iDreamPost

సుడిగాలి మళ్లీ వచ్చి పోయాడు.. ఎవరూ పట్టించుకోలేదు పాపం

జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా సుధీర్ కు మంచి పాపులారిటీ దక్కింది. రష్మి గౌతమ్ తో ఆన్‌ స్క్రీన్‌ లవ్ రొమాన్స్ వల్ల సుధీర్‌ కి స్టార్‌ డమ్‌ వచ్చింది. ఇప్పుడు సినిమాలు అంటూ చేస్తున్నాడు. తాజాగా కాలింగ్ సహస్ర సినిమా విడుదల అయింది. ఆ సినిమా ఫలితం ఏంటో అందరికి తెల్సిందే.

జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా సుధీర్ కు మంచి పాపులారిటీ దక్కింది. రష్మి గౌతమ్ తో ఆన్‌ స్క్రీన్‌ లవ్ రొమాన్స్ వల్ల సుధీర్‌ కి స్టార్‌ డమ్‌ వచ్చింది. ఇప్పుడు సినిమాలు అంటూ చేస్తున్నాడు. తాజాగా కాలింగ్ సహస్ర సినిమా విడుదల అయింది. ఆ సినిమా ఫలితం ఏంటో అందరికి తెల్సిందే.

సుడిగాలి మళ్లీ వచ్చి పోయాడు.. ఎవరూ పట్టించుకోలేదు పాపం

ఈటీవీ జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌. బుల్లి తెర స్టార్‌ అంటూ అభిమానులు పిలుచుకునే స్థాయికి వచ్చిన సుడిగాలి సుధీర్‌ కెరీర్ లో కొత్త దారిలో అడుగులు వేశాడు. బుల్లి తెర ద్వారా వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకుని హీరోగా వెండి తెరపై అడుగు పెట్టాడు. ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్‌ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసే స్థాయి నుంచి హీరోగా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. జబర్దస్త్‌ లో ఉన్న సమయంలోనే వరుసగా హీరోగా సినిమాలు కమిట్ అయ్యాడు. సుధీర్‌ ఇప్పటికే పలు సినిమాలతో హీరోగా వచ్చాడు. కానీ అందులో ఏ ఒక్కటి కూడా కమర్షియల్‌ గా గట్టి విజయాన్ని సొంతం చేసుకోలేదు. దాంతో సుధీర్‌ సినీ కెరీర్ పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

సుడిగాలి సుధీర్‌ తాజాగా మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిసెంబర్‌ 1న సుధీర్ నటించిన ‘కాలింగ్ సహస్త్ర’ సినిమా వచ్చింది. ఆ సినిమాతో కాస్త అయినా బూస్ట్‌ దక్కుతుందని సుధీర్‌ ఆశ పడ్డాడు. కానీ కాలింగ్ సహస్ర సినిమా ఇలా వచ్చి అలా వెళ్లి పోయింది. చాలా మందికి సుధీర్‌ సినిమా వచ్చిందనే విషయమే తెలియదు అంటూ సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. జబర్దస్త్‌ ద్వారా దక్కిన స్టార్‌ ఇమేజ్ ను అనవసర ప్రయత్నాలు చేసి పోగొట్టుకుంటున్నాడు అంటూ కొందరు సుధీర్‌ ఫ్యాన్స్ స్వయంగా విమర్శిస్తున్నారు. సుడిగాలి సుధీర్‌ కామెడీ స్కిట్స్‌ అంటే ఇష్టపడే వారు ఆయన సినిమాలను గురించి కనీసం మాట్లాడుకునేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. అంటే సుధీర్‌ ను చాలా మంది బుల్లి తెరకే పరిమితం అవ్వాలని కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది.

sudigali sudheer calling sahasra

ఇప్పటికే సుధీర్‌ ఫుల్‌ టైమ్‌ హీరోగా మారి పోయాడు. ఇప్పటికే మరో రెండు మూడు సినిమాలకు సుధీర్‌ కమిట్ అయ్యి ఉన్నాడు. ఆ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాల ఫలితాలపై ఏ ఒక్కరికి కూడా పెద్దగా నమ్మకం లేదు. కనుక చాలా త్వరగానే సుధీర్‌ హీరోగా ప్రస్థానంను ముగించాల్సి రావచ్చు అంటున్నారు. హీరోగా చేయకుంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అయినా సుధీర్‌ చేయాలి.. లేదంటే మళ్లీ బుల్లి తెరపై జబర్దస్త్‌ లేదా అలాంటి కార్యక్రమాలను చేసుకోవాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జబర్దస్త్‌ ని వీడటం సుడిగాలి సుధీర్ చేసిన అతి పెద్ద తప్పు అని కొందరు అంటూ ఉంటారు. ఆ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? జబర్దస్త్‌ చేస్తూ హీరోగా సినిమాలు చేస్తూ ఫలితం ఉండేదని మీరు భావిస్తున్నారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి