ప్రస్తుతం అన్ని భాషల్లోనూ రాజ్యమేలుతున్న బయోపిక్ ల ట్రెండ్ లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత మీద తీస్తున్న తలైవి సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఎంఎక్స్ ప్లేయర్ సంస్థ క్వీన్ పేరుతో రమ్యకృష్ణ టైటిల్ రోల్ లో ఒక వెబ్ సిరీస్ ని రిలీజ్ చేసింది . అన్ని వాస్తవాలు చూపించారా లేదా అనేది పక్కన పెడితే టేకింగ్ పరంగానూ ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ పరంగానూ దీనికి ఫీడ్ బ్యాక్ బాగా వచ్చింది.
ఈ నేపథ్యంలో విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న తలైవి అంచనాలు అందుకోవడానికి పెద్ద కసరత్తే చేయాలి. ఇవాళ ఎంజిఆర్ గా నటిస్తున్న అరవింద్ స్వామి లుక్ రిలీజ్ చేశారు. మేకప్ మహత్యమో ఏమో కానీ గెడ్డం మీసాలు లేకుండా అచ్చుగుద్దినట్టు అరవింద్ స్వామి ఎంజిఆర్ గా పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యాడు. కొద్దిరోజుల క్రితం వదిలిన కంగనా రౌనత్ లుక్ మీదే చాలా నెగటీవ్ కామెంట్స్ వచ్చాయి. కంగనా జయలలితగా సూట్ అవ్వలేదని సోషల్ మీడియాలో ఫీడ్ బ్యాక్ వచ్చింది.
దేశ వ్యాప్తంగా ఇటీవల పెను దుమారం రేపిన అంశం సనాతన ధర్మం. సనాతన ధర్మం మలేరియా, టైఫాయిడ్, కరోనా లాంటిదని, దాన్ని సమూలంగా నాశనం చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, క్రీడల శాఖ మంత్రి, నటుడు ఉదయ నిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజెపీ నేతలు, హిందూ ధార్మిక సంఘాల సభ్యులు విరుచుకుపడిన సంగతి విదితమే. తాను తప్పేమీ మాట్లాడలేదని, తన మాటలు కొంత మంది కావాలని వక్రీకరించారని, తన మాటలకు కట్టుబడి […]