iDreamPost

అఫీషియల్: పుష్ప-2 కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు!

Pushpa Team Officially Announced Pushpa 2 New Release Date: పుష్ప 2 సినిమా వాయిదా ఇప్పుడు అధికారికం అయిపోయింది. అందుకు సంబంధించి టీమ్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. సినిమా వాయిదా అంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు.

Pushpa Team Officially Announced Pushpa 2 New Release Date: పుష్ప 2 సినిమా వాయిదా ఇప్పుడు అధికారికం అయిపోయింది. అందుకు సంబంధించి టీమ్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. సినిమా వాయిదా అంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు.

అఫీషియల్: పుష్ప-2 కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు!

పుష్ప 2 సినిమా కోసం కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా ప్రేక్షకుల ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి గతంలో కూడా చాలానే పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా సినిమా వాయిదా అంటూ చాలా వార్తలు వచ్చాయి. కానీ, అలాంటి ప్రతిసారి తాము ఆగస్టు 15కే వస్తున్నాం అంటూ టీమ్ బల్లగుద్ది చెప్పింది. ఈసారి కూడా పుష్ప సినిమా వాయిదా పడింది అంటూ గత వారం రోజులుగా వార్తలు జోరందుకున్నాయి. అభిమానుల్లో కూడా కాస్త టెన్షన్ మొదలైంది. అలా జరగదులే అంటూ సర్దిచెప్పుకున్నారు. కానీ, ఈసారి ఆ పుకార్లు నిజమయ్యాయి. పుష్ప 2 ది రైజ్ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పుష్ప 2 సినిమా రిలీజ్ కోసం వాళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ, ఆ మూవీ మాత్రం వాయిదా పడిపోయింది. నిన్నటి వరకు అవి పుకార్లు అనుకున్నారు. కానీ, వాటిని నిజం చేస్తూ పుష్ప టీమ్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అలాగే అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీని ఏడాది చివరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అభిమానులను మన్నించమంటూ ఒక నోట్ కూడా విడుదల చేశారు. తాము ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు అంటూ ఆ నోట్ లో వివరించారు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయడం లేదు అంటూ స్పష్టం చేశారు.

గతంలో ప్రతిసారి పుష్ప 2 సినిమా కచ్చితంగా ఆగస్టు నెలలోనే వస్తుంది అని చెప్పారు. కానీ, ఈసారి మాత్రం వెనకడుగు వేయక తప్పలేదు. ఆగస్టు 15న విడుదల కావాల్సిన సినిమాని.. డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ని, ఫ్యాన్స్ కోసం ఒక లేఖను విడుదల చేశారు. పుష్ప టీమ్ పెట్టిన ఆ పోస్టులో వాయిదా వేయడానికి గల కారణాలను చెప్పుకొచ్చారు. “పుష్ప 2 మూవీ పాన్ ఇండియా లెవల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. పుష్ప సాధించిన సక్సెస్ తో మా మీద ఉన్న బాధ్యత పెరిగింది. పుష్ప 2 సినిమాని మరింత అద్భుతంగా తెరకెక్కించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము అలుపెరగకుండా మీకు మంచి సినిమాని అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. చెప్పిన తేదీకి విడుదల చేసేందుకు మా శ్రాయశక్తులా ప్రయత్నించాం.

మిగిలి ఉన్న షూట్.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి సంబంధించి ఈ నిర్ణయం తీసుకోకతప్పడం లేదు. ఆగస్టు 15 2024న ఈ చిత్రా విడుదల చేయడం లేదు. ఒక మంచి చిత్రాన్ని మీకు ఇవ్వాలి అనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడా రాజీ పడకుండా బిగ్ స్క్రీన్ లో మీకు ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించే మూవీని అందివ్వడానికే ఈ నిర్ణయం. టీజర్, పాటలకు అన్ని భాషల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మీరు కచ్చితంగా మెచ్చుకునే చిత్రాన్ని మీకు అందిస్తామని మాటిస్తున్నాం. మా మీద మీరు ఉంచిన నమ్మకానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకులు, మా భాగస్వాములకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తాం” అంటూ ఆ పోస్టులో చెప్పుకొచ్చారు. పుష్ప 2 సినిమా వాయిదా పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి