iDreamPost

Pushpa : అనుకున్న దానికన్నా ఎక్కువే సాధించిన బన్నీ

Pushpa : అనుకున్న దానికన్నా ఎక్కువే సాధించిన బన్నీ

అదేంటి పుష్ప వంద కోట్లు గ్రాస్ తేవడం పెద్ద విశేషమా అనుకోకండి. అసలు మ్యాటర్ వేరే ఉంది. నార్త్ లో ఒక్క హిందీ వెర్షన్ నుంచే ఇంత మొత్తాన్ని రాబట్టిన అయిదో సినిమాగా పుష్ప పార్ట్ 1 ది రైజ్ అరుదైన ఘనత సాధించింది. బాహుబలి రెండు భాగాలు, కెజిఎఫ్, 2.0 తర్వాత గర్వంగా నిలబడింది. గ్రాఫిక్స్, ఇతరత్రా హంగులు లేకుండా ఒక కమర్షియల్ మూవీ ఈ స్థాయిలో వసూలు చేయడం నిజంగా విశేషమే. అయిదు రోజుల క్రితం ఓటిటిలో రిలీజైనప్పుడు హిందీ వెర్షన్ అందుబాటులోకి తేలేదు. తెలుగు తమిళం మళయాలం కన్నడతో సరిపెట్టారు. కానీ డిమాండ్ అంతకంతా పెరిగిపోవడంతో ఈ 14న ప్రైమ్ లోనే హిందీ డబ్బింగ్ ని అందించబోతున్నారు.

విశేషంగా క్రీడా రాజకీయ సినిమా రంగాలకు చెందిన ఇతర సెలబ్రిటీలు పుష్పని ప్రత్యేకంగా ప్రశంసల్లో ముంచెత్తడం ట్విట్టర్ ని బట్టి గమనించవచ్చు. హిందీ లేకపోయినా సరే సబ్ టైటిల్స్ తో చూసి మరీ తమ ఆనందాన్ని పంచుకున్నారు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్, 83 లాంటి పోటీని తట్టుకుని ఎలాంటి ప్రమోషన్ చేయకుండా పుష్ప ఈ ఫీట్ సాధించడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం చేసినట్టు పుష్ప టీమ్ కు కనీసం ముంబైలో ఒక ఈవెంట్ చేసే టైం కూడా లేకపోయింది. ప్రెస్ మీట్లతో సరిపెట్టారు. అయినా కూడా నార్త్ ఆడియన్స్ దీన్ని బ్రహ్మాండంగా ఆదరించారు.

నిన్నటి నుంచి పుష్ప హిందీ నెమ్మదించింది. ఇక ఓటిటిలో వచ్చేస్తోంది కాబట్టి ఇంతకన్నా కలెక్షన్ల ఆశించలేం. పైగా చాలా రాష్ట్రాల్లో థియేటర్ల ఆంక్షలు తీవ్రంగా ఉన్నాయి. కేసులు పెరగడంతో జనం థియేటర్లకు రావడం తగ్గించుకున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప దక్కించుకున్న కలెక్షన్లు గొప్పవే. మళ్ళీ కెజిఎఫ్ 2 వచ్చేదాకా ఇవి సేఫ్ గా ఉండటం ఖాయం. బాహుబలిని క్రాస్ చేసే అవకాశం ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లకు మాత్రమే ఉంది కాబట్టి నాన్ బిబి క్యాటగిరిలో పోటీ ఉండనుంది. ఈ ఏడాది డిసెంబర్ లో పుష్ప పార్ట్ 2 ది రూల్ విడుదల చేసే ప్లానింగ్ తో ఉన్నారు అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్. అదెన్ని సంచలనాలు రేపుతుందో

Also Read : Latha Mangeshkar : లెజెండరీ సింగర్ “లతా మంగేష్కర్” కి కోవిడ్ పాజిటివ్.. ICU లో చికిత్స!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి