iDreamPost

ఆ ఒక్క మాటతో రోహిత్​పై రెస్పెక్ట్ పెరిగింది.. సంజూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published May 08, 2024 | 6:51 PMUpdated May 08, 2024 | 6:51 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధం గురించి సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ రోజు హిట్​మ్యాన్ చెప్పిన ఆ ఒక్క మాటతో అతడిపై మరింత రెస్పెక్ట్ పెరిగిందన్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధం గురించి సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ రోజు హిట్​మ్యాన్ చెప్పిన ఆ ఒక్క మాటతో అతడిపై మరింత రెస్పెక్ట్ పెరిగిందన్నాడు.

  • Published May 08, 2024 | 6:51 PMUpdated May 08, 2024 | 6:51 PM
ఆ ఒక్క మాటతో రోహిత్​పై రెస్పెక్ట్ పెరిగింది.. సంజూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సంజూ శాంసన్.. టీ20 వరల్డ్ కప్ టీమ్ సెలెక్షన్ సమయంలో బాగా వినిపించిన పేరు. ఈ వికెట్ కీపర్, బ్యాటర్ భారత జట్టులో ఉండాల్సిందేనని జోరుగా డిమాండ్లు వచ్చాయి. బ్యాటింగ్, కీపింగ్, ఫిట్​నెస్​.. ఇలా అన్నింటా సంజూ తనను తాను నిరూపించుకున్నాడని, అతడ్ని జట్టులోకి తీసుకోవాల్సిందేనని భారత క్రికెట్ బోర్డును కోరారు అభిమానులు. ఐపీఎల్​-2024లో శాంసన్ అదరగొట్టడంతో అతడ్ని టీమ్​లోకి తీసుకోక తప్పలేదు. అయితే 9 ఏళ్ల కిందే ఇంటర్నేషనల్ డెబ్యూ ఇచ్చిన సంజూ.. టీమ్​లో తన ప్లేస్​ను మాత్రం పదిలపర్చుకోలేదు. ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన టైమ్​లోనూ ఇబ్బందులు పడ్డాడు. ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నాడీ డాషింగ్ బ్యాటర్. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ తనకు ఇచ్చిన సపోర్ట్ గురించి షేర్ చేసుకున్నాడు.

జింబాబ్వే జట్టుతో 2015లో జరిగిన టీ20 సిరీస్​తో అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేశాడు సంజూ శాంసన్. అయితే అనుకున్నంతగా రాణించకపోవడంతో టీమ్​కు దూరమయ్యాడు. మళ్లీ జట్టులోకి రావడానికి చాలా కాలం పట్టింది. శ్రీలంక సిరీస్​తో టీమిండియాతో తన జర్నీని తిరిగి స్టార్ట్ చేశాడు. అప్పటి రోజుల్ని ఓ ఇంటర్వ్యూలో అతడు గుర్తుచేసుకున్నాడు. ఆ సిరీస్ టైమ్​లో రోహిత్ తనతో మాట్లాడిన క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. హిట్​మ్యాన్ చెప్పిన ఆ ఒక్క మాటతో అతడిపై తనకు ఉన్న గౌరవం మరింత పెరిగిందన్నాడు. టీమ్​తో జాయిన్ అయ్యాక తనతో మాట్లాడిన మొదటి వ్యక్తి రోహితేనని తెలిపాడు శాంసన్.

‘భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాక టీమ్​లో చోటు కోల్పోయా. మళ్లీ 5 ఏళ్ల తర్వాత జట్టులోకి తిరిగొచ్చా. 24 ఏళ్ల వయసులో నేను కమ్​బ్యాక్ ఇచ్చా. టీమ్​లోకి నేను రాగానే నాతో రోహిత్ భాయ్ మాట్లాడాడు. జట్టుతో చేరగానే నాతో మాట్లాడిన మొదటి వ్యక్తి అతడే. సంజూ ఎలా ఉన్నావ్? అంతా ఓకేనా? నువ్వు ఐపీఎల్​లో చాలా బాగా ఆడావ్. ముంబై ఇండియన్స్ మీద భారీ సిక్సులు కొట్టావ్ అంటూ నన్ను మెచ్చుకున్నాడు. నాకు కావాల్సిన సపోర్ట్​ను అతడు అందించాడు. న్యూజిలాండ్ సిరీస్​లో ఓ రోజు ఏం తోచక నా రూమ్​లో ఒంటరిగా కూర్చున్నా. అప్పుడు రోహిత్ భాయ్ కాల్ చేసి డిన్నర్​కు వెళ్దామని పిలిచాడు. భోజనం సమయంలో రేపు సిక్సర్లు కొట్టు అంటూ ప్రోత్సహించాడు. అతడి మాటలు నాలో ఎనలేని విశ్వాసం నింపాయి’ అని చెబుతూ సంజూ ఎమోషనల్ అయ్యాడు.

 

View this post on Instagram

 

A post shared by Bobby 🇮🇳 (@rohitianbobby45)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి