iDreamPost

పెళ్లి చేసి పల్లకిలో ఊరేగించాలనుకున్న కూతురు.. పాడెపై శవంగా!

  • Published May 24, 2024 | 1:16 PMUpdated May 24, 2024 | 1:16 PM

Pune Porsche Car Accident: కన్నబిడ్డ బంగారు భవిష్యత్తు కోసం ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. పెళ్లీడుకొచ్చిన కుమార్తెకి.. ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపాలని భావించిన వారు.. చివరకు పాడెపై శవంగా మారిన బిడ్డను చూసి గుండెలు బాదుకుంటున్నారు. ఆ వివరాలు..

Pune Porsche Car Accident: కన్నబిడ్డ బంగారు భవిష్యత్తు కోసం ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. పెళ్లీడుకొచ్చిన కుమార్తెకి.. ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపాలని భావించిన వారు.. చివరకు పాడెపై శవంగా మారిన బిడ్డను చూసి గుండెలు బాదుకుంటున్నారు. ఆ వివరాలు..

  • Published May 24, 2024 | 1:16 PMUpdated May 24, 2024 | 1:16 PM
పెళ్లి చేసి పల్లకిలో ఊరేగించాలనుకున్న కూతురు.. పాడెపై శవంగా!

ఆడపిల్ల అంటే అనవసరపు భారం అని భావించే తల్లిదండ్రులు నేటి కాలంలో కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే తల్లిదండ్రులు మాత్రం ఈ కోవకు చెందిన వాళ్లు కారు. వారికి ఆడా, మగా తేడా లేదు. ఎవరైనా ఒక్కటే. అందుకే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అని భావించారు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పించారు. అంతులేని ప్రేమను పంచారు. ఆడపిల్ల తన కాళ్ల మీద తాను నిలబడాలనే ఉద్దేశంతో.. పెద్ద చదువులు చదివించారు. ఆ యువతి కూడా తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుంది. ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు.. చక్కని ఉద్యోగం.. అలా ఆ యువతి జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది.

బిడ్డను బాగా చదివించారు.. ఉద్యోగం కూడా వచ్చింది.. ఇక త్వరోలనే మంచి కుర్రాడిని చూసి.. అమ్మాయికి పెళ్లి చేయాలని భావించారు. కుమార్తె పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే యాక్సిడెంట్‌ ఆ తల్లిదండ్రులు ఆశల మీద నీళ్లు చల్లింది. పెళ్లి చేసి పల్లకిలో ఊరేగించాల్సిన బిడ్డను పాడెపై శవంగా మోసుకెళ్లే దుస్థితి వచ్చింది. ఆ తల్లిదండ్రుల బాధ చూసి ప్రతి ఒక్కరు కన్నీరు పెడుతున్నారు. ఆ వివరాలు..

పూణేలో ఆదివారం వెలుగు చూసిన కారు ప్రమాదం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాగిన మత్తులో మైనర్‌ బాలుడు.. హై ఎండ్‌ పోర్షే కారును అత్యంత వేగంగా నడిపి.. ఇద్దరు మృతికి కారణం అయిన సంగతి తెలిసిందే. అత్యంత వేగంతో దూసుకువచ్చిన పోర్షే కారు.. ఎదురుగా వస్తోన్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బండి మీద ఉన్న యువతి, యువకుడు ఇద్దరు చనిపోయారు. వీరిని మధ్యప్రదేశ్‌కు చెందిన అనిష్‌ అవధియా, అశ్వని కోస్తాగా గుర్తించారు. వీరిద్దరు పూణేలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఇక ప్రమాద ధాటికి.. అశ్విని సుమారు 20 అడుగుల ఎత్తుకు ఎగిరి.. వేగంగా కిందకు పడి.. స్పాట్‌లోనే చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

ఇక ఈ ఘటనలో కోర్టు తీర్పుపై ప్రతి ఒక్కరు అసంతృప్తి వ్యక్తం చేశారు. అతివేగంతో ఇద్దరి మృతికి కారణమైన బాలుడికి కోర్టు కేవలం గంటల వ్యవధిలోనే బెయిల్‌ మంజూరు చేయడం.. అతడికి విధించిన షరతులు చూసి.. ప్రతి ఒక్కరు అవాక్కయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో.. కోర్టు.. నిందితుడి బెయిల్‌ రద్దు చేసింది. ఇక అశ్విని తల్లిదండ్రులు అయితే జరిగిన దారుణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తమ బిడ్డ తిరిగి వస్తుందనే ఆశలోనే ఉన్నారు.

అశ్విని తల్లి మమత మాట్లాడుతూ.. ‘‘త్వరలోనే నా బిడ్డకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి.. అత్తారింటికి పంపాలనుకున్నాం. కానీ ఇంతలోనే ఇలా పాడె ఎక్కించాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు’’ అంటూ కన్నీరుమున్నీరవుతుంది. ‘‘నా బిడ్డ చాలా ప్రతిభావంతురాలు. అలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. నా బిడ్డ తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నది. ఎంతో స్మార్ట్‌.. స్వంతంత్ర భావాలు కలిగిన యువతి. అన్ని రంగాల్లో ముందుండేది. తనతో ఆఖరి సారి మాట్లాడినప్పుడు.. వచ్చే నెలలో వాళ్ల నాన్న బర్త్‌డే ఉంది. అలానే రిటైర్మెంట్‌ కూడా ఉంది. ఆ సందర్భంగా పెద్ద పార్టీ ఏర్పాటు చేయాలని ప్లాన్‌ చేసుకుంది’’ అని గుర్తుకు చేసుకుంది.

‘‘కానీ ఓ కుర్రాడి నిర్లక్ష్యం తన కలలని నాశనం చేసింది. అలాంటి వ్యక్తికి కోర్టు కేవలం ప్రమాదం గురించి వ్యాసం రాయమనడం.. 15 రోజులు ట్రాఫిక్‌ నిబంధనలు అధ్యాయనం చేయాలి అని తీర్పు ఇవ్వడమే కాక.. బెయిల్‌ మంజూరు చేయడం దారుణం. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. అప్పుడే మా బిడ్డ ఆత్మకు శాంతి చేకూరుతుంది’’ అని ఆవేదన వ్యక్తం చేస్తుసింది అశ్విని తల్లి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి