iDreamPost

VIDEO: ప్రియాంక గాంధీకి వెరైటీ వెల్​కమ్.. బొకే ఇచ్చారు గానీ..!

  • Author singhj Published - 11:25 AM, Tue - 7 November 23

కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రియాంక గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ఒక బహిరంగ సభలో పాల్గొన్న ఆమెకు పార్టీ నేతలు బొకే ఇచ్చారు. కానీ ఆ బొకేలో ఒకటి మిస్సయింది.

కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రియాంక గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ఒక బహిరంగ సభలో పాల్గొన్న ఆమెకు పార్టీ నేతలు బొకే ఇచ్చారు. కానీ ఆ బొకేలో ఒకటి మిస్సయింది.

  • Author singhj Published - 11:25 AM, Tue - 7 November 23
VIDEO: ప్రియాంక గాంధీకి వెరైటీ వెల్​కమ్.. బొకే ఇచ్చారు గానీ..!

రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఏదైనా సభకు హాజరైనప్పుడు వారికి స్పెషల్​గా వెల్​కమ్ చెప్పడం మామూలే. పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్టేజీ పైకి రావాల్సిందిగా ఆహ్వానించడాన్ని చూస్తూనే ఉంటాం. మన దేశంలోనే అనే కాదు విదేశాల్లోనూ దాదాపుగా ఇదే పద్ధతిని ఫాలో అవుతుంటారు. అయితే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రముఖ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కూడా ఇలాంటి ఓ అనుభవమే ఎదురైంది. తాజాగా ప్రియాంక మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.

ఇండోర్​లోని ప్రచార సభలో ప్రియాంక గాంధీ వేదిక మీదకు రాగానే లోకల్ కాంగ్రెస్ లీడర్స్ ఆమెకు స్వాగతం పలికారు. ప్రియాంకకు పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి వెల్​కమ్ చెప్పారు. అయితే ఒక నాయకుడు ఆమెకు ఇచ్చిన పూలగుత్తిలో పూలు మాయమయ్యాయి. దీన్ని గమనించారు ప్రియాంక. బొకే ఇచ్చారు గానీ అందులో పువ్వులు లేకపోవడంతో ఈ విషయాన్ని అక్కడ ఉన్న నేతలకు చెప్పారు. దీంతో వేదకపై ఉన్న కాంగ్రెస్ నేతలంతా నవ్వుకున్నారు. ప్రియాంకకు ఇచ్చిన బొకేలో పువ్వులు లేకపోవడం, ఆమె ఈ విషయాన్ని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్లు నవ్వుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రియాంకకు కాంగ్రెస్ నేతలు వెరైటీ వెల్​కమ్ ఇవ్వడంపై బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ పాఠక్ రియాక్ట్ అయ్యారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇదో గుత్తి స్కామ్ అని.. పుష్పగుచ్ఛం నుంచి పువ్వులు మాయమయ్యాయంటూ కామెంట్ చేశారు. అయితే ఆయనకు కాంగ్రెస్ నేతలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇండోర్ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ.. బీజేపీ సర్కారు తీరుపై విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత 18 ఏళ్లుగా బీజేపీ పవర్​లో ఉందని.. అయినా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ సర్కారు 250 కుంభకోణాలు చేసిందని.. ప్రజాధనాన్ని దోచుకుందని ప్రియాంక ఆరోపించారు.

ఇదీ చదవండి: రష్మికకు మద్దతుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి