iDreamPost

రష్మికకు మద్దతుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత!

ఇక, డీప్‌ ఫేక్‌ వీడియోకు సంబంధించి రాజకీయ, సినీ వర్గాలనుంచి రష్మికకు మద్దతు లభిస్తోంది. ఒక్కొక్కరిగా తమ సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఈ వివాదంపై స్పందిస్తున్నారు...

ఇక, డీప్‌ ఫేక్‌ వీడియోకు సంబంధించి రాజకీయ, సినీ వర్గాలనుంచి రష్మికకు మద్దతు లభిస్తోంది. ఒక్కొక్కరిగా తమ సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఈ వివాదంపై స్పందిస్తున్నారు...

రష్మికకు మద్దతుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత!

రష్మిక మందన్న డీప్‌ ఫేక్‌ వీడియో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఫేక్‌ వీడియోపై రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంపై మాట్లాడాలంటే బాధగా ఉందన్నారు. ఈ విషయాన్ని కచ్చితంగా షేర్ చేసుకుంటానని, టెక్నాలజీని చూస్తుంటే భయమేస్తోందని అన్నారు. టెక్నాలజీ వల్ల అందరం కూడా ప్రమాదంలో ఉన్నట్లేనని పేర్కొన్నారు. ఇలాంటి ఘటన కాలేజ్, స్కూల్ రోజుల్లో జరిగితే ఎలా నెగ్గుకొచ్చేదాన్నో? అంటూ ఎమోషనల్‌ అయ్యారు.

ఇక, డీప్‌ ఫేక్‌ వీడియోకు సంబంధించి రాజకీయ, సినీ వర్గాలనుంచి రష్మికకు మద్దతు లభిస్తోంది. ఒక్కొక్కరిగా తమ సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఈ వివాదంపై స్పందిస్తున్నారు. డీప్‌ ఫేక్‌ వీడియో చేసిన వారిని వెంటనే పట్టుకుని, శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రష్మిక మందన్న డీప్‌ ఫేక్‌ వీడియోపై స్పందించారు. రష్మికకు తన మద్దతు తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ రష్మిక మందన్నను టార్గెట్‌ చేసుకుని విడుదలైన డీప్‌ ఫేక్‌ వీడియో ఆన్‌లైన్‌లోని

భయంకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. సైబర్‌ ప్రమాదాలనుంచి మహిళల్ని రక్షించడానికి అత్యవసర చర్యలు కావాలి. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి అశ్విన్‌, ఇతరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కఠిన చర్యలు తీసుకోవటానికి సమయం ఆసన్నం అయింది’’ అని పేర్కొన్నారు. ఇక, కేంద్ర ఈ వీడియోపై.. ఇలాంటి వీడియోలు తయారు చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరి, రష్మికకు కల్వకుంట్ల కవిత మద్దతుగా నిలవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి