iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలోని చిన్నారి.. ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్.. జూనియర్ సాయి పల్లవి అట!

  • Published Apr 20, 2024 | 6:04 PM Updated Updated Apr 20, 2024 | 6:04 PM

ఈ ఫోటోలో తండ్రి చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. కుర్రాళ్ల మనస్సు దోచేసిన ఈ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలో తండ్రి చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. కుర్రాళ్ల మనస్సు దోచేసిన ఈ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

  • Published Apr 20, 2024 | 6:04 PMUpdated Apr 20, 2024 | 6:04 PM
ఈ ఫోటోలోని చిన్నారి.. ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్.. జూనియర్ సాయి పల్లవి అట!

‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ ఖడ్గం సినిమాలో సంగీత అడిగినట్లుగా.. ప్రతి హీరోయిన్ కూడా తమను తాము నిరూపించుకునే జనాలకు స్ట్రైక్ అయ్యే క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. అలాంటి ఛాన్స్ ఫస్ట్ సినిమాతోనే రావొచ్చు లేదా ఐదారు,  పది సినిమాలతో కూడా రావొచ్చు . అప్పటి వరకు స్క్రిప్ట్ వింటూ.. వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోతుంటారు. కానీ ఒక్కసారి క్లిక్ అయితే చాలు స్టార్ డమ్ ఒక్కసారిగా వచ్చి చేరుతోంది. అవకాశాలు వరుసగా క్యూ కడుతుంటాయి. రెమ్యునరేషన్ అమాంతం పెంచుకునే ఛాన్స్ లభిస్తుంది. బడా హీరోల సరసన ఆడి పాడొచ్చు. ఇటీవల కాలంలో కొంత మంది హీరోయిన్లు త్వరగానే క్లిక్ అయ్యారు. వారిలో ఒకరు ఈ పాప కూడా.

ఈ ఫోటోలో ఓ వ్యక్తి చేతిలో ఉన్న ఈ పాప ఎవరో తెలుసా.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అన్న గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తండ్రి డాక్టర్. కానీ ఆమె యాక్టర్ అయ్యింది. చిన్నవయస్సులోనే నటిగా ఎంట్రీ ఇచ్చి అదరగొడుతోంది. ఒక్క తెలుగు సినిమా చేయకపోయినా కూడా టాలీవుడ్ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. ప్రేమలు మూవీతో మాలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా టాలీవుడ్ పరిశ్రమలో కూడా సక్సెస్ అందుకున్న మరో మలయాళ కుట్టీ మమితా బైజు. రేణు రాయ్ పాత్రలో .. చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది ఈ కేరళ కుట్టీ. ప్రేమలు చిన్న సినిమాగా వచ్చి రూ. 100 కోట్లను కొల్లగొట్టిన సంగతి విదితమే. ఆమె నటనకు ఫిదా అయిపోయారు. జూనియర్ సాయి పల్లవి అంటూ పొగుడుతున్నారు.

కేరళలోని కొట్టాయంలో పుట్టిన ఈ చిన్నది.. 2017 నుండి యాక్టింగ్ చేస్తోంది. తొలుత చిన్న చిన్న రోల్స్‌లో మెప్పించి.. ఆ తర్వాత లీడ్ క్యారెక్టర్ చేసింది. సర్వోపరి పాలక్కరన్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మమితా.. హనీ బీ, డాకినీ, కృష్షం, స్కూల్ డైరీ, ద ఇంటర్నేషనల్ లోక్ స్టోరీ, వికృతి, కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్, ఆపరేషన్ జావా, సూపర్ శరణ్య, ప్రణయ విలాసం, రామచంద్ర బాస్ అండ్ కో వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన చిత్రం ప్రేమలు. ఈ మూవీతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసేసింది. అలాగే రెబల్ అనే తమిళ చిత్రంతో అలరించింది ఈ బ్యూటీ. ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. కాగా, ప్రేమలు ఇచ్చిన హైప్స్ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు నేరుగా ఓ తెలుగు మూవీ చేయనున్నట్లు టాక్. విజయ్ దేవర కొండ సరసన నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet