iDreamPost

బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న యానిమల్.. రికార్డులు గల్లంతే?

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వలో తెరకెక్కతున్న భారీ బడ్జెట్ చిత్రం యానిమల్. ఆడియెన్స్ లో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్ల వరదలోనే బాలీవుడ్ రికార్డులన్నీ కొట్టుకుపోతాయని సినీ పండిట్స్ అంచనా వేస్తున్నారు.

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వలో తెరకెక్కతున్న భారీ బడ్జెట్ చిత్రం యానిమల్. ఆడియెన్స్ లో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్ల వరదలోనే బాలీవుడ్ రికార్డులన్నీ కొట్టుకుపోతాయని సినీ పండిట్స్ అంచనా వేస్తున్నారు.

బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న యానిమల్.. రికార్డులు గల్లంతే?

బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకోబోతున్న సినిమాగా యానిమల్ సినిమా ఇప్పటికే సంచలనం క్రియేట్ చేసింది. ప్రీబుకింగ్స్, వాటి రెవెన్యూలు చూస్తుంటే అందరికీ మతిపోతోంది. ఢిల్లీ, ముంబైలలో అయితే ఆ పిచ్చికి అంతూపొంతూ లేకుండానే పోతోంది. తెలుగు డైరెక్టర్లు ఎగరేస్తున్న జెండాకి ఇదో పెద్ద ఉదాహరణ. మామూలు టికెట్ 240 అయితే, రిక్లైనర్స్ 2500 వరకూ వెళ్ళడంతో అందరికీ బొమ్మ కనిపిస్తోంది. కబీర్ సింగ్(అర్జున్ రెడ్డి)సినిమాతో బాలీవుడ్లో బాంబ్ పేల్చిన మన ప్రిస్టేజియస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దెబ్బకి బాలీవుడ్ మొత్తం సాహో అయిపోయింది. బాలీవుడ్లో వస్తున్న తన రెండో సినిమా యానిమల్ మరో పెనుసంచలననానికి హైవే సెట్ చేసిందని బాలీవుడ్ మీడియా ప్లస్ ఇతర హై ర్యాంక్ రెగ్యులర్ మీడియాకు యానిమల్ సినిమాకి బ్రహ్మరథం పడుతుండడం గొప్ప విశేషం.

సందీప్ రెడ్డి వంగా చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ తో తీసిన యానిమల్ కేస్టింగ్…..రణ్బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీడియోల్ ఇలా ఒక్కొక్క పేరు వింటుంటే నిజంగా యానిమల్ సినిమా బాక్సాఫీసును వేటాడకమానదనే రేపటి పిక్చర్ ఈ క్షణమే కనిపిస్తోందని నార్త్ వెబ్ సైట్లన్నీ కోడై కూస్తున్నాయి. మొన్నటివరకూ చాక్లెట్ బాయ్ లా కనిపించిన రణబీర్ కపూర్ ఊహించనంత వైలెంట్గా కనిపించి ట్రైలరే బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి చేరడం మరో ఎత్తు. యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ సీన్సూ కలసి తెరకి నిప్పు పెట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ట్రైలరే ఇలా ఉంటే ఇంక సినిమా మొత్తం ఏ రేంజ్లో ఉంటుందన్నది ఇప్పుడు బాలీవుడ్ పరిశ్రమని గడగడలాడిస్తోంది.

ఈ మధ్యంతా దాదాపుగా తెరమరుగైపోయిన బాబీడియోల్ యానిమల్ సినిమాతో తిరిగి కమ్ బ్యాక్ ఇవ్వడం కూడా సినిమాకి సూపర్ టాక్ ని తెచ్చింది. పైగా బాబీడియోల్ ఇందులో మూగవాడు కూడా అని టాక్. ఇద్దరికిద్దరు సాండోల్లా కనిపించడం, ఒకరితో ఒకరు తలపడుతుంటే కొత్తగా ఉంది. డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న యానిమల్ మీద ఈ మధ్య రోజుల్లో ఏ సినిమాకి లేనంత హీట్, క్రేజ్, డిమాండ్ వచ్చాయంటే ఇదంతా సందీప్ వంగా ప్రత్యేకతేనని రణబీర్, అనిల్ కపూర్, బాబీడియోల్ అందరూ ముక్తకంఠంతో ఒప్పుకుంటున్నారంటే.. మనోడు ఏ రేంజ్లో వాళ్ళని ఇంప్రెస్ చేశాడో ఊహించడం ఏమంత కష్టమేమీ కాదు. తెలుగువాళ్ళ స్ట్రోకులకి ఇప్పటికే కుదేలైపోయిన బాలీవుడ్ యానిమల్ సినిమా క్రియేట్ చేసిన ప్రీరిలీజ్ హంగామాతో హడలెత్తిపోతోంది. ప్రతీరోజూ యానిమల్ సినిమా అప్డ్టేట్స్ తో వెబ్ సైట్లన్నీ హోరెత్తిపోతున్నాయి. దాదాపుగా అన్నిభాషలలో వెబ్ సైట్లు యానిమల్ సినిమా వాయిస్ తోనే గాండ్రిస్తున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్ల వరదలోనే బాలీవుడ్ రికార్డులన్నీ కొట్టుకుపోతాయని సినీ పండిట్స్ అంచనా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి