iDreamPost

కల్కి vs దేవర.. ఇద్దరి మార్కెట్ ఎంత? ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ?

ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ కాబోతున్నా.. కలెక్షన్ల వసూలు అటు ఉంచితే.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అన్న లెక్కలపైనే ఆత్రుత నెలకొంది. మరీ ఈ ఏడాది విడుదల కాబోతున్న రెండు భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో బజ్ ఎలా ఉందంటే..?

ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ కాబోతున్నా.. కలెక్షన్ల వసూలు అటు ఉంచితే.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అన్న లెక్కలపైనే ఆత్రుత నెలకొంది. మరీ ఈ ఏడాది విడుదల కాబోతున్న రెండు భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో బజ్ ఎలా ఉందంటే..?

కల్కి vs దేవర.. ఇద్దరి మార్కెట్ ఎంత?  ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ?

గతంలో సినిమా ఎలా ఉంది అనే టాక్ నడిచేది. కానీ నేడు ఈ లెక్క మారింది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత.. బాక్సాఫీసు వద్ద వసూలు చేసిన కలెక్షన్లు మాత్రమే సినిమా హిట్టా, ఫట్టా అని డిసైడ్ చేస్తున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందు రిలీజ్ అయ్యాక తేలిన లెక్కలే సినిమా సక్సెస్సా కాదా అనేది తేలుస్తున్నాయని ట్రేడ్ పండితుల మాట. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లకు రైట్స్ అమ్ముడయ్యాయి, ఓటీటీ, శాటిలైట్ హక్కులు ఎంతకు కొనుగోలు అయ్యాయో ఓ లెక్క అయితే.. తొలి రోజు కలెక్షన్స్, వీకెండ్, ఎండింగ్ వసూళ్లు కీలకంగా మారాయి. మరీ ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న రెండు బడా చిత్రాల ప్రీ రిలీజ్  లెక్కలేలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

బాహుబలితో పాన్ ఇండియా కాదు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ మార్కెట్ రేంజ్ సాహో, సలార్ మూవీలతో పెరిగింది. దీంతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తోన్న కల్కి 2898 ఏడీ పై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ, కల్కి మూవీ ప్రొడ్యూసింగ్ కంపెనీ వైజయంతి మూవీస్‌కు బాగా అచ్చొచ్చిన డేట్ మే 9న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఎలక్షన్స్, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కల్కి గురించి ఓ బజ్ గట్టిగా వినిపిస్తోంది. ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బు అయ్యేలా చేస్తోంది. అదేంటంటే.. కల్కి రిలీజ్‌కు ముందే రికార్డుల వేటకు రెడీ అవుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 200 కోట్లు జరగనుందట. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇన్ని కోట్లు కోట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయ్యిందని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీ తర్వాత తారక్ కనిపించి రెండేళ్లు అయిపోయింది. అతడి రాక కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దేవరతో బాక్సాఫీసును షేక్ చేసేందుకు సిద్ధం అయ్యాడు ఈ మ్యాన్ ఆఫ్ ది మాస్. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 దసరా కానుకగా.. ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదల కానుంది. అయితే ఇప్పుటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు వినిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 140 కోట్లకు ఉందన్నది న్యూస్. ఏపీ, తెలంగాణలో ఈ మేరకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస జరిగినట్లు తెలస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కరణ్ జోహార్ దక్కించుకున్న సంగతి విదితమే.

అంతేకాకుండా మిగిలిన భాషల్లో రూ. 60 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని తెలుస్తోంది. ఓవర్సీస్ రైట్స్, ఆడియో, ఓటీటీ రైట్స్ అన్ని కలిసి.. రూ. 400 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్ గట్టిగా నడుస్తోంది. ఈ లెక్కన బాక్సాఫీసును షేక్ చేసేందుకు సిద్ధం అయ్యాడు యంగ్ టైగర్. సినిమా టాక్ బట్టి కలెక్షన్లు కుమ్మే అవకాశాలున్నాయి. ఈ లెక్కన దేవర వెయ్యి కోట్లకు పైగా వసూలు చేయడం పక్కా అంటున్నారు పండితులు. అటు కల్కి విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఓవర్సీస్, నార్త్ ఇండియా, ఓటీటీ, శాటిలైట్స్ రూపంలో రూ. 600 నుండి రూ. 1000 కోట్లు బిజినెస్ జరగనుందని తెలుస్తోంది. మరీ ఈ రెండు సినిమాల్లో భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి