iDreamPost
android-app
ios-app

‘కల్కి’ రన్ టైమ్ లాక్! మూవీలో అవే హైలెట్.. ఫ్యాన్స్ కు పండగే!

  • Published Jun 19, 2024 | 12:49 PM Updated Updated Jun 19, 2024 | 12:49 PM

Kalki 2898 AD Censor Report: 'కల్కి' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటి? రన్ టైమ్ ఎంత? సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ మూవీని చూసి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

Kalki 2898 AD Censor Report: 'కల్కి' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటి? రన్ టైమ్ ఎంత? సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ మూవీని చూసి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

‘కల్కి’ రన్ టైమ్ లాక్! మూవీలో అవే హైలెట్.. ఫ్యాన్స్ కు పండగే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ముందుకు రాబోతోంది. అయితే ఒక్క రోజు ముందుగానే అంటే జూన్ 26నే ఓవర్సీస్ లో కల్కి రాబోతున్నాడు. అయితే ప్రమోషన్లు సరిగ్గా జరగట్లేదని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అలాంటి వారికి ఓ సాలిడ్ న్యూస్ కల్కి నుంచి అందింది. తాజాగా సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాను వీక్షించారు. మరి కల్కి రన్ టైమ్ ఎంత? దానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘కల్కి’ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఆ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయి కళ్లతో ఉన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మాసీవ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం తాజాగా సెన్సార్ బోర్డ్ దగ్గరకు వెళ్లింది. సెన్సార్ బోర్డ్ సభ్యులు కల్కి మూవీని చూసి ఏమన్నారు? దాని రన్ టైమ్ ఎంత? చూద్దాం. హైదరాబాద్ లోని క్యూబ్ ఆఫీస్ లో కల్కి చిత్రాన్ని చూశారు సెన్సార్ బోర్డ్ సభ్యులు. ఇక ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే రన్ టైమ్ దాదాపు 2 గంటల 55 నిమిషాలుకు లాక్ చేసినట్లు తెలుస్తోంది.

Kalki Run Time Locked

ఇక బైరవగా ప్రభాస్ దుమ్ముదులిపాడని, కల్కిలో ట్విస్ట్ లకు ప్రేక్షకుల మైండ్ పోతుందని చెప్పుకొచ్చారు సెన్సార్ బోర్డ్ సభ్యులు. ఇక కల్కికి విజువల్స్ హైలెట్ అని పేర్కొన్నారు. అలాగే ఎమెషన్స్ తో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ కూడా అదిరిపోయిందని టాక్. ఇలాంటి ఊహా లోకాన్ని సృష్టించిన నాగ్ అశ్విన్ న్ను ప్రశంసించారు. మెుత్తానికి కల్కి బ్లాక్ బస్టర్ లోడింగ్ అని తెలిపారు. దాదాపు సినిమా 3 గంటలు ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లలో పండగ చేసుకోనున్నారు. మరి కల్కి రన్ టైమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.