iDreamPost
android-app
ios-app

Anushka Shetty: అనుష్కకు అరుదైన వ్యాధి.. పాపం చాలా ఇబ్బందులు పడిందట

  • Published Jun 19, 2024 | 12:24 PM Updated Updated Jun 19, 2024 | 12:24 PM

టాలీవుడ్‌ జేజమ్మ, స్వీటీ అను‍ష్క శెట్టికి అరుదైన వ్యాధి ఉందట. దీని వల్ల ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నదంట. ఆ వివరాలు..

టాలీవుడ్‌ జేజమ్మ, స్వీటీ అను‍ష్క శెట్టికి అరుదైన వ్యాధి ఉందట. దీని వల్ల ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నదంట. ఆ వివరాలు..

  • Published Jun 19, 2024 | 12:24 PMUpdated Jun 19, 2024 | 12:24 PM
Anushka Shetty: అనుష్కకు అరుదైన వ్యాధి.. పాపం చాలా ఇబ్బందులు పడిందట

అనుష్క.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని అందం. సూపర్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ.. ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తూ.. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. బిల్లాలో బికినీ వేసి గ్లామర్‌ షో చేసినా.. అరుంధతిలో జేజమ్మగా రౌధ్రం పండించినా.. అనుష్కకే చెల్లింది. స్వీటీ అంటూ ఎంతో ప్రేమగా పిల్చుకునే ఈ బ్యూటీ కెరీర్‌ అరుంధతి చిత్రంతో మలుపు తిరిగింది. టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటడ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారింది. ఆ తర్వాత బాహుబలి సినిమా అనుష్కను రేంజ్‌ను పాన్‌ ఇండియా స్థాయికి తీసుకుళ్లింది.

టాప్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న అనుష్క కెరీర్‌కు సైజ్‌ జీరో సినిమా బ్రేక్‌ వేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం అనుష్క వెయిట్‌ విపరీతంగా పెరిగడంతో.. అవకాశాలు తగ్గాయని చెప్పవచ్చు. ఇక కొన్ని రోజుల క్రితం మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా అనుష్కకు సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది.

సినిమాల సంగతి అలా ఉంచితే అనుష్క అరుదైన వ్యాధితో బాధపడుతుందట. దీని వల్ల షూటింగ్‌లో చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గతంలో అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. ఇంతకు అనుష్కకు ఉన్న సమస్య ఏంటి అంటే.. ఒక్కసారి నవ్వడం ప్రారంభిస్తే అనుష్క చాలా సేపు ఆపకుండా నవ్వుతూనే ఉంటుందట. ఎవరైనా జోక్ చేస్తే చాలు పగలబడి నవ్వుతుందట ఈ అమ్మడు. దాని వల్ల సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందిపడ్డాను అని చెప్పుకొచ్చింది. నవ్వడం సమస్య ఎలా అవుతుంది అనుకుంటే.. సాధారణంగా మనం ఏదైనా జోక్‌ వింటే కాసేపు నవ్వుకుంటాం. తర్వాత ఆపేస్తాం.

కానీ స్వీటీ విషయంలో అలా కాదంట. పైగా తనకు చాలా త్వరగా నవ్వొస్తుందని చెప్పుకొచ్చింది. చాలా చిన్న చిన్న సరదా విషయాలకు కూడా బాగా నవ్వుతుందట. ఒక్కసారి నవ్వడం మొదలుపెడితే ఆపుకోలేదు. ఎంత ప్రయత్నించినా నవ్వు ఆపుకోలేక ఒక్కోసారి నేలపై పడి నవ్వుకుంటుందట. ఈ కారణంగా చాలాసార్లు షూటింగ్ ఆగిపోయిందని తెలిపింది. షూటింగ్‌లో ఏదైనా కామెడీ సన్నివేశం చేయాల్సి వస్తే ఆ రోజు షూటింగ్ చాలా ఆలస్యం అవుతుందట. తాను నవ్వడం మొదలు పెడితే యూనిట్ మొత్తం టీ బ్రేక్ తీసుకుంటారు అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సీటీ. వారు టీ తాగి రిలాక్స్ అయ్యే వరకు తాను నవ్వుతూనే ఉంటాను అని సరదాగా తెలిపింది అనుష్క.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడు అనుష్క జోరు తగ్గించింది. ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఇటీవలే నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన మిస్టర్ శెట్టి మిస్ పోలిశెట్టి సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘కథానర్’ అనే సినిమాలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాతో స్వీటీ మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ‘కథానర్’ సినిమాలో జయసూర్య, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/