iDreamPost

పవన్ కళ్యాణ్ వాళ్ల కాళ్లు పట్టుకో.. పోసాని సంచలన కామెంట్స్

టీడీపీ, పవన్ కళ్యాణ్ లపై ఏపీ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ మండిపడ్డారు. కాపు ప్రజలను ఏకతాటిపైకి తీసుకు వచ్చి.. ఓట్లు మాత్రం టీడీపి వేయాలని పేర్కొనడంపై పవన్ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు.

టీడీపీ, పవన్ కళ్యాణ్ లపై ఏపీ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ మండిపడ్డారు. కాపు ప్రజలను ఏకతాటిపైకి తీసుకు వచ్చి.. ఓట్లు మాత్రం టీడీపి వేయాలని పేర్కొనడంపై పవన్ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ వాళ్ల కాళ్లు పట్టుకో.. పోసాని సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ సారి గెలుపు తమదేనంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ప్రస్తుతం టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో పొత్తుపై పోటీ చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కాపు ఓట్లు టీడీపీకి వేయండని పవన్ కళ్యాణ్ పేర్కొనడంపై ఏపీ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ స్పందించారు. ఏపీలో అక్రమ రవాణా జరుగుతుందంటూ పవన్ కళ్యాన్ గతంలో చేసిన వ్యాఖ్యలపైనా పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు కనీసం కాపు సోదరీమణుల కాళ్లైనా పట్టుకొని క్షమాపణ అడుగు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

జగన్ మోహన్ రెడ్డి చేసిన తప్పేంటో చెప్పాలంటూ సవాలు విసిరారు. ఆయన ఒక్కరిని కూడా విమర్శించలేదని పోసాని అన్నారు. ‘ ఏపీలోని వాలంటీర్లు ముఖ్యంగా మహిళలు ఎవరి గ్రామాల్లోనే వారు నివసిస్తూ.. సంతోషంగా పనిచేసుకుంటుంటే.. అందరికీ ఫించను అందిస్తుంటే.. ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందంటూ వ్యాఖ్యలు చేశావ్. నీ బుర్ర ఎక్కడ ఉంది. నీవు క్షమించరాని మిస్టేక్స్ చేస్తున్నావ్. ఇప్పటికైనా.. అందరికీ కాదూ.. కాపు కులానికైనా క్షమాపణ చెప్పు. నేను సిగ్గుపడుతున్నా.. వాలంటీర్ల అవమానించినందుకు.. వీళ్లను మానవ అక్రమ రవాణాదారులుగా తప్పుడు ప్రచారం చేసినందుకు సిగ్గు పడు. కనీసం కాపు సోదరీమణుల కాళ్లైన పట్టుకని క్షమాపణ అడుగు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్ర బాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.’ అలాగే హెరిటేజ్ సంస్థ చంద్రబాబుది కాదు.. అది మోహన్ బాబుది. మీకు ఎవ్వరికి తెలియదు. నాకు తెలుసు. నేను చెప్పినవీ నిజాలో అబద్దాలో తెలుసుకోవాలంటే నార్కొటెక్ట్ చేయించండి. అబద్దం చెప్పినట్లయితే లైవ్ లో నన్ను చెప్పుతో కొట్టండి’ అంటూ సవాలు విసిరారు. సినీ నటి జయప్రదను అవమానించారని, టీడీపీ వ్యవస్థాపకుడు , దిగ్గజ నటుడు సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన మంచి పథకాలను చంద్ర బాబు అధికారంలోకి రాగానే నాశనం చేశారంటూ మండిపడ్డారు. అలాగే కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి