iDreamPost
android-app
ios-app

మీ తాతని చెప్పులతో కొట్టించింది ఎవరు?బ్రాహ్మణికి పోసాని కౌంటర్‌!

మీ తాతని చెప్పులతో కొట్టించింది ఎవరు?బ్రాహ్మణికి పోసాని  కౌంటర్‌!

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జెల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్రమంగా నిబంధనలకు విరుద్దంగా వందల కోట్ల రూపాయలను కాజేసి చాకచక్యంగా తప్పించుకోబోయి అడ్డంగా దొరికిపోయారు బాబు. ఏపీ సీఐడీ సెప్టెంబర్ 9న నంద్యాలలో బాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ అరెస్టుపై టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యలు అరిచి గగ్గోలు పెడుతున్నారు. బాబు ఏ తప్పు చేయకున్నా రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారంటూ నానా హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో బాబు అరెస్టుకు వ్యతిరేకంగా నారావారి కోడలు నారా బ్రాహ్మణి రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు అరెస్టు అక్రమమని, 40 ఏళ్లుగా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ బ్రాహ్మణి తెలిపింది. కాగా బ్రాహ్మణి వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.

ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. అధికార దాహంతో పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని పోసాని విరుచుకుపడ్డాడు. మీ తాత ఎన్టీఆర్ పై చెప్పులు వేయించి మానసిక క్షోభకు గురిచేసి తన మరణానికి కారణమైన బాబు ఎంత దుర్మార్గుడో తెలుసుకో అంటూ బ్రాహ్మణికి హిత బోద చేశాడు. అసత్యాలు ప్రచారం చేసి టీడీపీ క్యాడర్ ను తనవైపు తిప్పుకుని, పార్టీని తన చేజిక్కించుకుని ఎన్టీఆర్ ను అవమానించిన తీరు ప్రజలకు తెలుసని పోసాని తెలిపాడు. ఎన్టీఆర్ పదవిని అక్రమంగా లాక్కొని, దాడి చేయించిన బాబును నిజాయితీపరుడంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని పోసాని వెల్లడించాడు. అందుకే స్కిల్ స్కామ్ కేసులో అరెస్టైన బాబుకు ప్రజలు ఎవరూ మద్దతు తెలపకుండా తెలివిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అవసరానికి వాడుకుని ఆ తర్వాత నట్టేట ముంచే నక్కజిత్తులమారి బాబు అని పోసాని దుయ్యబట్టారు.

marsbahis girişgamdom girişjojobet girişjojobet girişsiteye gitJojobet Giriş