iDreamPost
android-app
ios-app

Bigg Boss 7: రతిక vs ప్రశాంత్.. అంతా చిల్లరలొల్లి చిల్లర..!

  • Published Sep 19, 2023 | 4:38 PM Updated Updated Sep 19, 2023 | 4:38 PM
  • Published Sep 19, 2023 | 4:38 PMUpdated Sep 19, 2023 | 4:38 PM
Bigg Boss 7: రతిక vs ప్రశాంత్.. అంతా చిల్లరలొల్లి చిల్లర..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ప్రేక్షకులు, కంటెస్టెంట్స్ కి అర్థంకాని వాళ్లు ఎవరైనా ఉన్నారు అంటే అది రతికా- ప్రశాంత్ అనే చెప్పాలి. ఏంటో వీళ్లని రెండు వారాలుగా చూస్తున్నా ఏమాత్రం అర్థం కావడంలేదు. ప్రేక్షకులకు అర్థం కాకపోయినా పర్లేదు.. కానీ, 24 గంటలు వాళ్లతోనే ఉంటున్న కంటెస్టెంట్స్ కి కూడా అర్థం కావడం లేదు. అప్పటికప్పుడు కలిసి తిరుగుతున్నారు.. అప్పుడే నామినేషన్స్.. మళ్లీ ఇకఇకలు పకపకలు చూపిస్తారు. మళ్లీ వెంటనే కుస్తీకి దిగుతున్నారు. ఈ సీజన్ లో ప్రేక్షకులకు ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అది ఇదే. వీళ్లేంటో.. వీళ్ల స్ట్రాటజీలు ఏంటో.. అసలు వీళ్లకైనా అర్థమవుతోందో లేదో?

హౌస్ లో పల్లవి ప్రశాంత్ రతికా రోజ్ వెంట తిరిగిన విషయం తెలిసిందే. ఆమె కూడా బాగానే ఎంటర్ టైన్ చేసి.. చివర్లో నామినేట్ చేసింది. ఆ తర్వాత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మహాబలి వర్సెస్ రణధీర టాస్కులో రతికాకి కౌంటర్లు మీద కౌంటర్లు వేశాడు. అబ్బో పల్లవి ప్రశాంత్ వీరోచితంగా రివేంజ్ తీర్చుకుంటున్నాడు అని ప్రేక్షకులు హ్యాపీ అయ్యేలోపే.. ఏంటి నీ కళ్లలో పాల సముద్రం దాచావా? అంటూ పులిహోర 2.0 వర్షన్ ని ప్రదర్శించాడు. సరేలే ఆడపిల్ల ఏడుస్తోంది అని కాస్త ఓదార్చుడులే అని అందరూ లైట్ తీసుకున్నారు. తిట్టినా గానీ తిరిగి మాట్లాడితే.. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి సహజం అంటూ ప్రేక్షకులు కూడా సర్దిచెప్పుకున్నారు. కానీ, మళ్లీ వెంటనే వీళ్లు గొడవకు దిగి ప్రేక్షకులకే కాదు.. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా పెద్ద షాకిచ్చారు.

అరే ఏంటి వీళ్లు? అని అందరూ తెల్ల ముఖాలు వేశారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో వీళ్ల గొడవే హైలెట్ అయింది. బిగ్ బాస్ హౌస్ లో జరిగిన గణపతి పూజను చూపించారు. ఆ తర్వాత హౌస్ లో మూడో పవరాస్త్రం కోసం పోటీ పడేందుకు అమర్ దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ ను బిగ్ బాస్ సెలక్ట్ చేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఎవరు పవరాస్త్రం కోసం అనర్హులో చెప్పండి అంటూ ప్రశ్నించాడు. దాంతో అందరూ ఓపెన్ అయిపోయి.. కడులో ఉన్నదంతా కక్కేశారు. అలా కక్కిన తర్వాత బిగ్ బాస్ ఊరుకోడు కదా.. వెంటనే ఆ వీడియోలను అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభాశెట్టికి చూపించాడు. ఇంకేముందు హౌస్ లో రచ్చ కచ్చితంగా మొదలవుతుంది. అయితే ఈ గొడవ కంటే ముందు రతికా- పల్లవి ప్రశాంత్ మధ్య వివాదం చెలరేగింది.

ముందురోజు చక్కగా నవ్వుకుంటూ.. ఫ్లోర్ మూమెంట్స్ కూడా చేసిన పల్లవి ప్రశాంత్.. ఈరోజు మాత్రం రతికా రోజ్ పై నిప్పులు చెరిగాడు. ఆమె కూడా పల్లవి ప్రశాంత్ మంచిగా మాట్లాడు అంటూ వార్నింగ్ ఇంచ్చింది. వేలు చూపించడంతో.. వేలు దించు అంటూ ప్రశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హే.. పో అంటూ కేకలు వేశాడు. అయినా ఆమె అక్కడి నుంచి కదలకపోవడంతో చేత్తో ఆమెను పక్కకు నెట్టాడు. దాంతో రతికా ఇంకా ఫైర్ అయిపోయింది. పల్లవి ప్రశాంత్.. చేయ్ వేశావంటే ఇంకోసారి మర్యాదగా ఉండదు అంటూ కేకలు వేసింది. రతికా వెల్లడం లేదని.. పల్లవి ప్రశాంత్ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ.. అన్నీ చిల్లర గొడవలు, చిల్లర అంటూ కామెంట్స్ చేశాడు. అయితే వీళ్ల మధ్య గొడవకు కారణం ఏంటి? వీళ్లు నిజంగానే గొడవ పడ్డారా? లేక ఏదైనా కంటెట్ ఇచ్చే ప్రయత్నంలో ఇలా చేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి.. పల్లవి ప్రశాంత్- రతికా రోజ్ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibom