iDreamPost

NTR రికార్డును బద్దలు కొట్టిన రేవంత్ రెడ్డి! 40 ఏళ్ల తరువాత..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఇదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ రికార్డు ను రేవంత్ రెడ్డి బద్దలు కొట్టారు. మరి.. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఇదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ రికార్డు ను రేవంత్ రెడ్డి బద్దలు కొట్టారు. మరి.. ఆ వివరాలు..

NTR రికార్డును బద్దలు కొట్టిన రేవంత్ రెడ్డి! 40 ఏళ్ల తరువాత..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దాదాపు పదేళ్ల తరువాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడో సారి ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు గెలిచారు. అలానే  ఎన్నికలు పూర్తయిన తరువాత వెంటనే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కే అనుకూలంగా ఓటర్లు తీర్పు ఇచ్చారని వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తూ హస్తం జెండా ఎగరేసింది. ఇది ఇలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎవరు అనేది చాలామందిలో వ్యక్తమయ్యాయి.  ఆ ఉత్కంఠకు తెరపడింది.

అందరూ ఊహించినట్లు గానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే  తెలంగాణ సీఎంగా అవకాశం దక్కింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిన్నటి వరకూ ముఖ్యమంత్రి ఎవరన్నది  ప్రకటించలేదు.  మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో కేసీ వేణుగోపాల్.. సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇలా సీఎంగా రేవంత్ రెడ్డి పేరు  ఖారారు కావడంతో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాక సీనియర్ ఎన్టీఆర్ రికార్డు ను రేవంత్ బద్దలు కొట్టారు. 40 ఏళ్ల తరువాత ఆ రికార్డును రేవంత్ రెడ్డి కొట్టేశాడని పొలిటికల్ సర్కిల్ లో అభినందనలు వెల్లువెత్తాయి. మరి.. రికార్డు ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి 2017లోకాంగ్రెస్ లోకి చేరారు. అతికొద్ది తక్కువ సమయంలోనే టీపీసీసీ పగ్గాలు చేపట్టారు రేవంత్ రెడ్డి. ఆ తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లారు. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిలో ఒకరిగా రేవంత్ ఎదిగారు.  సీఎం పేరు లేకుండానే ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం అనే సంగతి తెలిసిందే. అదే విధానంలో సీఎం పేరు చెప్పకుండా కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లింది. అయితే ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అన్నీ తానై రేవంత్ రెడ్డి చక్రం తిప్పారు.

మొత్తానికి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో తొలుత సీఎం రేసులో ప్రస్తుతం నలుగురు ఉన్నారని పరిశీలకులు భావించారు. వారిలో ముందు ఉన్నది మాత్రం రేవంత్ రెడ్డి అనడంలో అతిశయోక్తి లేదు. పార్టీ హైకమాండ్ మొగ్గు కూడా ఆయనవైపే చూపించింది. ఎందుకంటే కాంగ్రెస్ లో అంత ఊపు రావడానికి కూడా కారణం.. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ విజయంపై  నమ్మకం కలిగిందని పార్టీలో ఆయనను వ్యతిరేకించే వారు కూడా అంగీకరించక తప్పని వాస్తవంగా మారింది.

కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మధు యష్కీ, షబ్బీర్ అలీ లాంటి లీడర్లు సీఎం పదవి ఆశించారని టాక్. అందరిని అంచనాలను తలకిందులు చేస్తూ సీఎం పదవిని రేవంత్ రెడ్డి చేపట్టనున్నారు. దీంతో రేవంత్ రెడ్డి.. ఎన్టీఆర్ 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టినట్లే అయింది. ఎలాంటి పాలనా అనుభవం లేకుండా 1983లో తొలిసారి సీఎంగా నందమూరి  తారక రామరావు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయంగా టీడీపిని మలచడంతో ఎన్టీఆర్ విజయం సాధించారు.

పార్టీ పెట్టినపుడు సినిమాలు తీసేవాళ్లు రాజకీయాలు చేస్తారా అంటూ అవహేళన చేశారు. అందరి నోళ్లకు తాళం వేస్తూ పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఘన విజయం సాధించారు.  అదే విధంగా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కూడా ఒక మంత్రిగా చేసిన అనుభవం లేదు.  అలాంటి వ్యక్తి ఇప్పుడు నేరుగా సీఎం అయ్యారు. దీంతో రేవంత్ రెడ్డి.. సీనియర్ ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొట్టారు. ఇలా ఎన్టీఆర్ రికార్డును రేవంత్ సాధిస్తారా.. లేదా అనే దానిపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు.  మరి.. 40 ఏళ్ల తరువాత సీనియర్ ఎన్టీఆర్ రికార్డును రేవంత్ రెడ్డి బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి