iDreamPost

చంద్రబాబు దెబ్బకి అయ్యన్న అవాక్కు! ఒక్కసారిగా ముంచేశాడట!

Chintakayala Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి  చింతకాయల అయ్యన్న పాత్రుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు. అలాంటి ఆయనకు టీడీపీ లో గట్టి భంగాపాటు ఎదురైందనే టాక్ వినిపిస్తోంది.

Chintakayala Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి  చింతకాయల అయ్యన్న పాత్రుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు. అలాంటి ఆయనకు టీడీపీ లో గట్టి భంగాపాటు ఎదురైందనే టాక్ వినిపిస్తోంది.

చంద్రబాబు దెబ్బకి అయ్యన్న అవాక్కు! ఒక్కసారిగా ముంచేశాడట!

రాజకీయాల్లో నిలబడేందుకు నేతలు అనేక వ్యూహాలు రచిస్తుంటారు. చాలా మంది ప్రజలకు సేవలు చేస్తూ..పొలిటికల్ గా స్ట్రాంగ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారికే అధిష్టానం కూడా టికెట్లు కేటాయిస్తుంది. కానీ మరో వర్గం..కేవలం అధిష్టానం వద్ద మెప్పు కోసం.. ప్రత్యర్థులను నేతలను తిట్టడం, దూషించడం పనిగా పెట్టుకుంటారు. అయితే అది కూడా ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ మరికొందరు నేతలు మరీ దిగజారుడుగా ప్రవర్తిస్తూ.. మహిళ ఎమ్మెల్యేలు, మంత్రులు అనే చూడకుండా ఇష్టానుసారం దూషిస్తుంటారు. తమ అధిష్టానం నుంచి ఏదో ఆశించి.. అలా చేసిన చాలా మంది నేతలకు భంగపాటు తప్పలేదు. తాజాగా ఆ కోవాలేనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బాబు గట్టి దెబ్బ కొట్టారని పొటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి  చింతకాయల అయ్యన్న పాత్రుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు. అలాంటి ఆయనకు టీడీపీ లో గట్టి భంగాపాటు ఎదురైంది. 2019లో ఆయన వైసీపీ వేవ్ లో ఘోర పరాభవాన్ని చవిచూశారు. అంతటి పరాభవం చూసిన..చిత్త చచ్చిన పులుపు చావాలేదు అన్నట్లు వైసీపీ పై విమర్శలు చేయడం మాత్రం మానుకోలేదు. చంద్రబాబు వద్ద మెప్పు కోసం సీఎం జగన్ పై ఇష్టానుసారంగా అయ్యన్న నోరుపారేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఆశించిన అనకాపల్లి సీటు విషయంలో బాబు గట్టి దెబ్బ కొట్టారని టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ఇంటిపోరు కూడా అయ్యన్నకు మరింత తలపోటుగా మారుతున్నట్లు సమాచారం.

Babu's hand to Ayyanna!

రాజకీయ వారసత్వం కోసం  కొడుకును నర్సీపట్నం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయించాలని ఒత్తిడి వస్తుంది. ఈ సమయంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితి అయ్యన్నకు  ఎదురైందని సమాచారం.  వచ్చే ఎన్నికల్లో కొడుకుని బరిలో దించకపోతే రాజకీయం వారసత్వం కష్టమనే భావనలో అయ్యన్న ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. నిజానికి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ.. కొడుకు అనకాపల్లి ఎంపీ సీటు కోసం అయ్యన్న తీవ్రంగా కష్టపడ్డారట. నోటిక వచ్చినట్లు అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ విధంగానే టీడీపీ అధ్యక్షుడు బాబు దృష్టిలో ఉంటూ అనకాపల్లి ఎంపీ సీటును కొడుకుకి వచ్చేలా యత్నించారు.

అయితే బాబు అలవాటు ప్రకారమే.. పైసలు ఉన్నవారికే  అనకాపల్లి సీటు ఇవ్వనున్నట్లు సంకేతాలు వచ్చాయని టాక్. ఇలా అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో బాబు గట్టి దెబ్బ కొట్టగా.. నర్సీపట్నంలోనైనా కొడుకును బరిలో దించాలని ఇంటిపోరు ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వకపోతే.. కుమారుడిని నర్సీపట్నం నుంచి బరిలోకి దించాలంటూ అయ్యన్న ఇంటి నుంచి ఒత్తిడి వస్తోన్నట్లుటాక్ వినిపిస్తోంది. అయ్యన్నపాత్రుడు ప్రవర్తనతో , దిగజారుడు మాటాలతో నియోజవర్గంలో ఏ మాత్రం పట్టు పెరగడం లేదు. మరోవైపు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వివాద రహితుడు కావడంతో..నియోజవర్గంలో మంచి పట్టు సాధించారు.

ఇటీవలే జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర నర్సీపట్నంలో విజయవంతం కావడంతో మరోసారి వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేస్తుదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితుల్లో  నర్సీపట్నం నుంచి తాను రంగంలోకి దిగితే వచ్చే ఎన్నికల వరకు అంటే 2029 వరకూ రాజకీయ వారసత్వం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సారి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేనప్పటికీ కొడుకను బరిలో నిలపడం ద్వారా రాజకీయ వారసత్వం కొనసాగించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. మరి.. అయ్యన్న పాత్రుడు గురించి పొటిలికల్ సర్కిల్ లో వినిపిస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి