iDreamPost

విపక్ష కూటమిపై పోలీస్ కేసు! 26 పార్టీలపై..

  • Author Soma Sekhar Published - 08:26 AM, Thu - 20 July 23
  • Author Soma Sekhar Published - 08:26 AM, Thu - 20 July 23
విపక్ష కూటమిపై పోలీస్ కేసు! 26 పార్టీలపై..

BJP పార్టీని ఎదుర్కొనేందుకు ఓ విపక్ష కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ కూటమికి ‘ఇండియా’ అనే పేరును ఖరారు చేశారు కూటమి సభ్యులు. ఈ క్రమంలోనే నిన్న(జూలై 19)న బెంగళూరులో జరిగిన ఈ కూటమి సమావేశంలో 26 విపక్ష పార్టీలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో ‘ఇండియా’ అనే పేరును అందరూ ఆమోదించుకున్నారు. ఇండియా అంటే.. ‘భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్టి కూటమి’ నిర్వచించారు విపక్ష పార్టీ నేతలు. ఇక ఈ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తు కూటమిపై పోలీప్ కంప్లైట్ ఇచ్చాడు డాక్టర్ అవినాష్ మిశ్రా అనే వ్యక్తి. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశంలో విపక్ష పార్టీలన్నీ కలిసి తమ కూటమికి ‘INDIA’ అనే పేరు పెట్టుకున్నారు. దాంతో ఈ పేరు పెట్టుకోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పేరుపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. డాక్టర్ అవినాష్ మిశ్రా అనే వ్యక్తి కాంగ్రెస్ తో సహా మెుత్తం కూటమిలో పాల్గొన్న మెుత్తం 26 పార్టీలపైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. విపక్ష కూటమి పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం దేశం పేరును తప్పుడు ప్రయోజనాలకు వాడుకుంటున్నారని అవినాష్ మిశ్రా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు ఢిల్లీలోని బరాఖంబ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అవినాష్ మిశ్రా. 1950 నాటి ఎంబ్లమ్స్ యాక్ట్ లో పొందుపరిచిన నిబంధనల ఆధారంగా ఆయన ఈ కేసును పెట్టారు. ఈ చట్టానికి విరుద్దంగా పేరు ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని అవినాష్ మిశ్రా కోరారు. కాగా.. కూటమికి ఇండియా అనే పేరును రాహుల్ గాంధీ సూచించారని, ఆ పేరును విపక్ష కూటమి నేతలంతా ఆమోదించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఖర్గే అధికారికంగా ప్రకటించారు. మరి ఈ కూటమి ఏ మేరకు బీజేపీ పై ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.


ఇదికూడా చదవండి: ఆక్సిజన్‌ మాస్క్‌తో విమానంలో సోనియా గాంధీ! ఏం జరిగిదంటే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి