iDreamPost
android-app
ios-app

నాగార్జున సోదరిపై పోలీస్ కేసు! కారణం ఏంటంటే?

  • Author Soma Sekhar Published - 03:05 PM, Mon - 18 September 23
  • Author Soma Sekhar Published - 03:05 PM, Mon - 18 September 23
నాగార్జున సోదరిపై పోలీస్ కేసు! కారణం ఏంటంటే?

ఇండస్ట్రీలో నటీ, నటులు వివాదాల్లో చిక్కుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇక వీరితో పాటుగా వీరి కుటుంబ సభ్యులు సైతం కొన్నిసార్లు వివాదాల్లో చిక్కుకుని విషయం పోలీస్ స్టేషన్ దాక వెళ్లిన సంఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా హీరో నాగార్జున సోదరిపై పోలీస్ కేసు నమోదైన వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున సోదరి నాగసుశీలపై మెుయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

నాగార్జున సోదరి, నిర్మాత నాగసుశీలపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఈనెల 12న నాగసుశీల, ఆమె అనుచరులు శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రయంపై దాడికి పాల్పడ్డారని ఆశ్రయం నిర్వాహకులు శ్రీనివాసరావు ఆరోపిస్తూ.. మెుయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు నాగసుశీలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఫిర్యాదు చేసిన శ్రీనివాసరావు, నాగసుశీల కలిసి చాలా సంవత్సరాలుగా కలిసి వ్యాపారం చేస్తున్నారు. వీరిద్దరు కలిసి రియల్ ఎస్టేట్ తో పాటుగా సినిమాలు కూడా నిర్మించారు.

కాగా.. వీరి భాగస్వామ్యంలో శ్రీనాగ్ కార్పోరేషన్ బ్యానర్ పై నాగసుశీల కొడుకు సుశాంత్ ను హీరోగా పెట్టి కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా సినిమాలు నిర్మించారు. చివరి సినిమా టైమ్ లో వీరిద్దరి మధ్య భూమి విషయంలో గొడవలు ఉన్నట్లు సమాచారం. ఈ గొడవల నేపథ్యంలో ఆమె శ్రీనివాసరావుపై కేసులు కూడా పెట్టారు. తాజాగా మరోసారి దర్శపీఠం ఆశ్రయంపై దాడి చేశారని నాగసుశీలపై ఈమె అనుచరులపై కేసు పెట్టారు శ్రీనివాసరావు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss