iDreamPost

‘తేజస్‌’ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోదీ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. కర్నాటక పర్యాటనలో భాగంగా బెంగుళూరులోని హెచ్ఏఎల్ ని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ ఈ అరుదైన ఫీట్ చేశారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. కర్నాటక పర్యాటనలో భాగంగా బెంగుళూరులోని హెచ్ఏఎల్ ని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ ఈ అరుదైన ఫీట్ చేశారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

‘తేజస్‌’ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోదీ!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం  ఆయన బెంగళూరు లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)ను సందర్శించారు. ఈ సందర్భంగానే అక్కడే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ను పరిశీలించారు. అనంతరం అందులో కాసేపు విహరించారు. ఆ ఫిక్స్ ను ప్రధాని తన ఎక్స్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రధాని  మోదీ ఫోటోలు ఎక్స్ వేదిగా షేర్ చేస్తూ..కొన్ని విషయాలను వెల్లడించారు. తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణం విజయవంతంగా పూర్తి చేశానని, ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. అంతేకాక ఈ ప్రయాణంతో మన స్వదేశీ సామర్థ్యంపై తన విశ్వాసం మరింత పెరిగిందని పేర్కొన్నారు. మన దేశ శక్తి సామర్థ్యాల పట్ల తనకు గర్వంగా ఉందన్నారు. ఇది మన శాస్త్రవేత్తల కృషి, అంకితభావానికి నిదర్శనమని స్వావలంబనలో మనం ప్రపంచంలో ఎవరి కంటే తక్కువ కాబోమని తాను గర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు.

భారత వాయుసేన, డీఆర్‌డీవో, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్ఏఎల్)కు హృదయపూర్వక అభినందనలని మోదీ తన ఎక్స్ అకౌంట్ లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా హల్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తయారీ యూనిట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ తయారీపై ఎక్కువ దృష్టి పెట్టింది. స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ను కొనుగోలు చేసేందుకు  ఇప్పటికే పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎంకే-ఐఐ-తేజస్ యుద్ధ విమాన ఇంజన్లను సంయుక్తంగా ఉత్పత్తి చేయడానికి అమెరికా రక్షణ దిగ్గజం జీఈ ఏరో స్పేస్ ..హాల్ తో  ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించడం విదేశాలకు మనపై మరింత నమ్మకాన్ని కలిగిస్తుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తేజస్ యుద్ధ విమానంలో మోదీ ప్రయాణించిన ఫిక్స్ వైరల్ అవుతోన్నాయి. మరి.. ప్రధాని మోదీ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి