iDreamPost

UAEలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ!

UAE Temple Inauguration: ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయాన్ని భారీ విస్తీర్ణంలో నిర్మించారు. ఇది పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది.

UAE Temple Inauguration: ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయాన్ని భారీ విస్తీర్ణంలో నిర్మించారు. ఇది పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది.

UAEలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ!

ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది హిందూవులు కలలు కన్న అయోధ్య రామ మందిర నిర్మాణం ఇటీవలే సాకారం అయ్యింది. ఈ నిర్మాణం కోసం కొన్ని దశాబ్దాల పాటు  హిందువులు వేయ్యి కళ్లతో ఎదురు చూశారు. ఎంతో మంది ఈ నిర్మాణం కోసం పోరాటలు చేసినా… ఘనత మాత్రం ప్రధానికే దక్కుతుంది. అలానే తాజాగా మరో ఘనత మోదీ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రధానికి దక్కని ఘనత తాజాగా నరేంద్ర మోదీకి దక్కింది. యూఈఏలో నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. బుధవారం అబుదాబి నగరం ఈ ఘనతకు వేదికైంది. మరి.. ఇక్కడ నిర్మించిన హిందూ ఆలయ ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబిలో 27 ఎకరాల్లో సువిశాలమైన బోచసన్వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ మందిర నిర్మాణం జరిగింది. బుధవారం ఈ ఆలయాన్ని భారత‍ ప్రధానమంత్రి నరేం‍ద్రమోదీ ప్రారంభించారు. ఆలయంలో పూజారులతో కలిసి  మోదీ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూ దేవతలకు హారతి ఇచ్చారు. ఆలయ ప్రారంభానికి విచ్చేసిన ప్రధాని మోదీని చూసేందుకు భారత పౌరులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. యూఏఈలోనే గాక మొత్తం మధ్యప్రాచ్యంలోనే పూర్తి హిందూ సంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయంగా ఇది గుర్తింపు పొందింది. ఇండియాతో యూఏఈ బలమైన బంధానికి, అలానే ఆ దేశ మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఈ ఆలయం నిలవనుంది. ఇక ఈ ఆలయ ప్రారంభోత్సవ వేడుకకు బాలీవుడ్ నటులు అక్షయ్‌ కుమార్‌, వివేక్‌ ఒబెరాయ్‌, మ్యూజిక్‌ కంపోజర్‌ శంకర్ మహదేవన్‌ హాజరయ్యారు.

దాదాపు 30 లక్షల దాకా భారతీయులున్న యూఏఈలో దేవాలయాలు లేకపోలేదు. దుబాయ్‌లో ఇప్పటికే రెండు హిందూ ఆలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అయితే అవి చూసేందుకు ఆలయాల్లా కాకుండా విల్లాల మాదిరిగా ఉంటాయి. యూఏఈ మొత్తంలోకూడా బాప్స్ మందిరం పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయంగా గుర్తింపు పొందింది. ఇది దుబాయ్‌–అబుదాబి హైవే సమీపంలో 27 ఎకరాల్లో నిర్మితమైంది. ఈ ఆలయ నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చైంది. మొత్తం నిర్మాణం బాప్స్‌ సంస్థ  ఆధ్వర్యంలోనే జరిగింది. 2019లో  నిర్మాణాన్ని ప్రారంభించగా, రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన నిపుణులు దాదాపు మూడేళ్ల పాటు శ్రమించి ఈ అద్భుత ఆలయాన్ని నిర్మించారు.  అరబ్ ఎమిరేట్స్ లోని ఏడు  ఎమిరేట్లకు ప్రతీకగా ఈ ఆలయానికి ఏడు గోపురాలను ఉంటాయి. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసిన  పాలరాయిని ఈ ఆలయ నిర్మాణంలో వినియోగించారు.

108 అడుగల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ దేవాలయంలో రూపుదిద్దుకుంది. ఈ ఆలయ పునాదుల్లో 100కు పైగా సెన్సర్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఇక  ఈ మందిరంలో ప్రార్థన మందిరం, సందర్శకుల కేంద్రం, గ్రంథాలయం, గ్యాలరీ, ఎగ్జిబిషన్‌ సెంటర్లు, ఉన్నాయి. ఏకంగా 5 వేల మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆటస్థలం కూడా ఉన్నాయి. మరి.. యూఏఈలో నిర్మించిన ఈ తొలి హిందూ దేవాలయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి