iDreamPost
android-app
ios-app

పవన్ తనయుడి కొత్త ట్యాలెంట్.. సూపర్ అంటున్న అడివిశేష్.. పొగిడేస్తున్న నెటిజన్లు..

  • Published Jun 18, 2022 | 8:00 PM Updated Updated Jun 18, 2022 | 8:00 PM
పవన్ తనయుడి కొత్త ట్యాలెంట్.. సూపర్ అంటున్న అడివిశేష్.. పొగిడేస్తున్న నెటిజన్లు..

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ త‌న‌యుడుగా అకిరా నంద‌న్ తెలుగు ప్రేక్ష‌కులందరికి సుప‌రిచిత‌మే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఇప్ప‌టికే న‌ట‌న‌, మార్షల్ ఆర్ట్స్ లాంటి పలు కళల్లో శిక్ష‌ణ తీసుకున్నాడు అకిరా. తాజాగా అకిరాలోని మరో ట్యాలెంట్ బయటపడింది.

అకిరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. తాజాగా అకిరా నందన్ మేజర్ సినిమాలోని హృద‌యమా అంటూ సాగే ఓ పాట‌ను కీబోర్డ్‌తో కంపోజ్ చేశాడు. ఈ వీడియోని అడివి శేష్ తన సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేయ‌గా ప్ర‌స్తుతం అది వైర‌ల్‌గా మారింది. అడివి శేష్.. అకిరా, ఆద్యలకు బాగా క్లోజ్. గతంలోనే వీరిద్దరితో అడివి శేష్ క్లోజ్ గా గడిపిన కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

అకిరా, అడివిశేష్ మధ్య ఉన్న మంచి సన్నిహిత బంధంతో అకిరా అడివిశేష్ కోసం మేజర్ సినిమాలోని పాటని కంపోజ్ చేశాడు. ఈ వీడియోని అడివిశేష్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసి.. ”ఈ పాట‌ను కంపోజ్ చేసి పంపినందుకు థ్యాంక్యూ అకిరా. అకిరా కంపోజ్ చేసిన ఈ పాటని చూడు” అంటూ మేజర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శశికిరణ్ ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు, నెటిజన్లు అకిరా నందన్ లో ఉన్న ఈ ట్యాలెంట్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంత అద్భుతంగా అకిరా కీబోర్డు వాయిస్తుండటంతో ప్రశంసలు కురిపిస్తూ వీడియోని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alAlobetAlobetPiabellacasinokatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş