సినిమా హీరో, జనసేన అధినేత పవన కల్యాణ్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా ప్రభుత్వ ఉన్నతాధికారులపై నోరు పారేసుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఐఏఎస్, ఐపీఎస్ చదువుకున్న అధికారులకు సిగ్గుండాలి.. అధికారులు సిగ్గుపడాలి అంటూ ఘాటు కామెంట్లు చేశారు. అధికారులు తలకాయలు ఎగరేస్తే.. ఆ తలకాయల్ని తీసేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. దక్షయజ్ఞంలో వీరభద్రుడిలా తలల్ని విసిరేసి కొడతామంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు.
వినమ్రతతో ఉంటేనే ఆ తలలు వాటి స్థానంలో ఉంటాయన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులపై పవన్ ఇలా నోరు పారేసుకోవటం మంచి కాదంటూ జనం మండిపడుతున్నారు. పవన్.. ఇదేమి వాగుడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు జైల్లో ఉన్నాడన్న బాధలో పవన్ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడని అంటున్నారు. మరి, ప్రభుత్వ ఉన్నతాధికారులపై పవన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ రాజకీయాల్లో ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. ఏపిలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.. దీంతో గెలుపు కోసం ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ కావడం టీడీపీలో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇటీవల చంద్రబాబుని కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన […]