iDreamPost

బంగారం మూవీ చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడెలా ఉందో తెలుసా…? బుట్టబొమ్మగా మారి

పవర్ స్టార్ పవన్ కళ్యాన్, మీరా చోప్రా నటించిన చిత్రం బంగారం. ఇందులో మీరా చోప్రా చెల్లెలిగా నటించిన చిన్న పిల్ల గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాన్, మీరా చోప్రా నటించిన చిత్రం బంగారం. ఇందులో మీరా చోప్రా చెల్లెలిగా నటించిన చిన్న పిల్ల గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా..?

బంగారం మూవీ చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడెలా ఉందో తెలుసా…? బుట్టబొమ్మగా మారి

గతంలో చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోలు, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంటున్నసంగతి విదితమే. గంగోత్రి చిత్రంలో అలరించిన పిల్లలు.. సజ్జా తేజ.. కావ్య కళ్యాణ్ రామ్..యాక్టర్స్ అయిపోవడమే కాదు.. స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. తేజ.. హనుమాన్ మూవీతో పాన్ ఇండియన్ స్టార్ గా మారి.. రూ. 300 కోట్లను కొల్లగొట్టాడు. కొంత మంది సీనియర్ హీరోలకు సాధ్యం కానీ రేర్ ఫీట్ సాధించాడు. అలాగే అతడు మూవీలో నటించిన పిల్లాడు.. దీపక్ సరోజ్.. సిద్దార్థ్ రాయ్ అంటూ ఇటీవల మన ముందుకు వచ్చాడు. అలాగే ఆనంద వర్థన్, ఆనీ, నిత్యా వీరంతా కూడా ఇప్పుడిప్పుడే యాక్టర్స్‌గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే.. పవన్ కళ్యాణ్ బంగారం మూవీలో ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

2006లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మీరా చోప్రా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం బంగారం. ఇందులో హీరోయిన్ చెల్లెలిగా మెప్పించిన చిన్నారి ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే.. ఇప్పుడు బుట్టబొమ్మలా తయారయ్యింది. ఇంతకు ఆమె పేరు సనూష. ఈ అమ్మాయి కూడా కేరళ కుట్టినే. 5 ఏట నుండే చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది సనూష. మలయాళ చిత్రాలతో పాటు తమిళం, తెలుగు చేసింది. తెలుగులో బాల నటిగా రెండంటే రెండు చిత్రాలే చేసింది. వాటిల్లో ఒకటి బంగారం. మలయాళంలో 20కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది. ఉత్తమ బాల నటిగా రెండు సార్లు జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది ఈ అమ్మడు. చూస్తూనే ఎదిగిపోయింది. 2012లో మిస్టర్ మురుగున్ చిత్రంతో లీడ్ యాక్ట్ అయ్యింది.

తెలుగులో జీనియస్‌తో పాటు మరో తెలుగు మూవీ చేసింది. అదే నాని మూవీ జెర్సీ. ఇందులో జర్నలిస్ట్ రమ్య పాత్రలో నటించింది సనూషనే. అయితే ఈ సినిమాతో ఆమెకు తెలుగులో ఆఫర్లు వస్తాయని అనుకున్నారు. కానీ నాలుగేళ్ల పాటు ఏ ఇండస్ట్రీలో వర్క్ చేయలేదు. దానికి కారణం.. కరోనా ఒకటైతే. కొంత మంది బాడీ షేమింగ్ చేయడంతో.. మానసికంగా కుంగుబాటుకు గురైంది. అప్పుడు కాస్త ట్రీట్ మెంట్ తీసుకుంది. దీంతోనే ఆమె సినిమాలేమీ ఒప్పుకోలేదని గతంలో చెప్పింది. 2023లో మలయాళంలో ఓ ఆఫర్ వచ్చింది. అదే జలధార పంపుసెట్ సిన్స్ 1962. ఈ మూవీతో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చింది సనూష. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ..ట్రిప్స్, మూవీస్‌కు సంబంధించిన పిక్స్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మాలీవుడ్ పరిశ్రమలో రెండు సినిమాలతో బిజీగా మారింది. లిక్కర్ ఐలాండ్, మరతకం వంటి చిత్రాలు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి