iDreamPost

Jr NTR: OG ని కమ్మేస్తున్న దేవర.. పవన్ ప్లేస్ లో తారక్ ర్యాంపేజ్ పక్కా!

ఇండస్ట్రీని ఓ న్యూస్ షేక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ OG మూవీని కమ్మేయడానికి దేవరగా వస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దాంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇండస్ట్రీని ఓ న్యూస్ షేక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ OG మూవీని కమ్మేయడానికి దేవరగా వస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దాంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Jr NTR: OG ని కమ్మేస్తున్న దేవర.. పవన్ ప్లేస్ లో తారక్ ర్యాంపేజ్ పక్కా!

‘దేవర’ యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ మూవీ. వీరి కాంబోలో సినిమా అనౌన్స్ చేసిన దగ్గరి నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దాంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? ఎప్పుడు చూద్దామా? అని వేయి కళ్లతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్ర టీజర్, ఫియర్ లెస్ సాంగ్ దేవరను మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. ఇక దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అంతకంటే ముందుగానే వచ్చేందుకు దేవర సిద్ధమైనట్లు తెలుస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్ OGని దేవర కమ్మేయనున్నాడని సమాచారం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ అనుకున్న ప్రకారం రిలీజ్ అయితే.. ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు నెలలు కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల దసరాకు మూవీని పోస్ట్ పోన్ చేశారు. ఈ విషయంలో యంగ్ టైగర్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అయితే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడతామని మేకర్స్ ధీమా ఉండటంతో.. ఫ్యాన్స్ కూడా హమ్మయ్య అనుకుంటున్నారు.

అయితే ఫ్యాన్స్ అసంతృప్తిని చల్లార్చేందుకు దేవర అనుకున్న టైమ్ కంటే ముందుగానే థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్-సుజిత్ మూవీ OG రావాలనుకున్న రోజు.. అంటే సెప్టెంబర్ 27 మీదే దేవర టీమ్ ఫోకస్ చేసిందట. అన్నీ కుదిరితే.. సెప్టెంబర్ 27న దేవర సినిమా వచ్చి OGని కమ్మేయడానికి రెడీగా ఉన్నాడు యంగ్ టైగర్. ఓజీకి డిజిటల్ హక్కుల రూపంలో సమస్యలు ఎదురవ్వడంతో.. సినిమా రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అదీకాక సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వెట్టాయాన్’ కూడా అక్టోబర్ 10న రాబోతోంది. దాంతో పాన్ ఇండియా మూవీకి క్లాష్ మంచిది కాదని దేవర టీమ్ భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ 27న వస్తేనే అన్ని విధాలా బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే ఓజీ మూవీ వచ్చే డేట్ కు దేవర రానున్నట్లు స్పష్టమవుతోంది. దాంతో పవన్ ప్లేస్ లో తారక్ వచ్చి థియేటర్లలో రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి