iDreamPost
android-app
ios-app

వీడియో: థియేటర్లో పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. స్క్రీన్ ని చింపేసి రచ్చ!

వీడియో: థియేటర్లో పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. స్క్రీన్ ని చింపేసి రచ్చ!

పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ ఉంది అనగానే థియేటర్ల ఓనర్స్ గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎప్పుడు ఏ థియేటర్ లో పవన్ ఫ్యాన్స్ రచ్చ చేస్తారో అని భయం భయంగా గడుపుతుంటారు. ఇప్పటికే రీ రిలీజ్ పేరిట థియేటర్లను ధ్వంసం చేయడం చూశాం. కుర్చీలు విరగొట్టడం, స్క్రీన్ ని చిపేయడం, బాణా సంచాలు కాల్చి థియేటర్ లో అగ్నిప్రమాదం జరిగేలా చేయడం కూడా చూశాం. ఇప్పుడు బ్రో సినిమా రిలీజ్ తో మరో థియేటర్ లో పవన్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఏకంగా స్క్రీన్ ని చింపేసి మిగిలిన ప్రేక్షకులకు తీవ్ర అసౌకర్యం కలిగేలా ప్రవర్తించారు.

ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సౌందర్య థియేటర్లో జరిగింది. స్క్రీన్ మీద పాలాభిషేకం చేసేందుకు ఫ్యాన్స్ పైకి ఎక్కారు. అక్కడ పాలాభిషేకం చేసే క్రమంలో వీరి అత్యుత్సాహంతో తోపులాట జరిగినట్లు చెబుతున్నారు. ఆ తోపులాటలో కొందరు స్క్రీన్ మీద పడటంతో స్క్రీన్ చిరిగిపోయినట్లు తెలుస్తోంది. ఆ తోపులాటలో కొందరు కుర్రాళ్లకు చొక్కాలు కూడా చిరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సౌందర్య థియేటర్ కు చేరుకున్నారు. ఎవరి వల్ల ఇలాంటి ఘటన జరిగిందని తెలుసుకుని కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. ఇద్దరు యువకులు పక్కన నిల్చుని ఉన్నారు. ఒక యువకుడు అసలు చొక్కా లేకుండా నిల్చుని ఉన్నాడు.

ఇద్దరు యువకులు పోలీసుల కారులో కూర్చుని ఉన్నారు. ఈ ఘటనపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో మిగిలిన వారికి ఎంత ఇబ్బంది కలుగుతుందో కాస్త ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. మీ అత్యుత్సాహంతో ఇలా థియేటర్ల ఓనర్లకు నష్టం కలిగించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సినిమాల రిలీజ్ లు ఉంటే కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరైతే ఇలా చేసే వాళ్లకు గట్టి పనిష్మెంట్ ఇస్తే.. ఇంక ఎవరు కూడా అభిమానం పేరుతో ఇలాంటి పనులు చేయరంటూ సూచిస్తున్నారు.

Jojobet GirişjojobetcasibomjojobetcasibombetsmovemariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişJojobet Giriş