iDreamPost

అతను మంచోడు- చంద్రబాబు

అతను మంచోడు- చంద్రబాబు

పవన్ ,చంద్రబాబుల “సహకార” రాజకీయం తరచుగా బయటడుతుంది. రెండు స్థానాలలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కు అసెంబ్లీ గడప తొక్కే అదృష్టం దక్కలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయ సమావేశాలలో,మీడియా ముందు ప్రభుత్వం మీద చేస్తున్న వాఖ్యలకు మంత్రులు,ముఖ్యమంత్రి శాసనసభలో కౌంటర్లు ఇస్తున్నారు.

దీనితో అధికారపక్షానికి కౌంటర్లను ఇచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంది. పవన్ కళ్యాణ్ మీద అధికార పక్షం చేసిన వాఖ్యలకు చంద్రబాబు,టీడీపీ ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేరాలు చెయ్యలేదని ,అతను మంచివాడని శాసనసభలో నిన్న చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చాడు.

రాజకీయంగా చంద్రబాబు సమాధానం చెప్పలేని సంకట పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అధికారపక్షం మీద దాడి చేయటం,అందరి దృష్టిని తనవైపు మరల్చుకోవటం గత కొంత కాలంగా జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు శాసనసభలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాట్లాడటంతో వీరి “సహకార” రాజకీయం మరింతగా బలపడింది.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను,ఆయన జనసేనను టీడీపీ కి బి-టీం గా ప్రజలు భావించటం వలనే ఘోరమైన పరాయజం పాలయ్యారు.టీడీపీ కూడా కేవలం 23 స్థానాలు మాత్రమే గెలిచి ఘోరమైన ఓటమితో ప్రజలలో తిరగటానికి ఇబ్బంది పడింది. నేనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద పోరాటం పేరుతొ వివిధ సభలు జరిపాడు.పవన్ కళ్యాణ్ వేసిన మార్గంలో చంద్రబాబు ఇప్పుడిపుడే బయటకొచ్చి సమావేశాలు పెడుతున్నాడు.

పవన్ కళ్యాణ్-చంద్రబాబు “సహకార” రాజకీయం ఎన్నిరోజులు కొనసాగుతుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి