iDreamPost

బిగ్ బ్రేకింగ్: బిగ్ బాస్ 7 తెలుగు విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్

Bigg Boss Winner Pallavi Prashanth Got Arrested: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులోని ఇంటి వద్దనే ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Bigg Boss Winner Pallavi Prashanth Got Arrested: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులోని ఇంటి వద్దనే ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు.

బిగ్ బ్రేకింగ్: బిగ్ బాస్ 7 తెలుగు విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అట్టహాసంగా ముగిసింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కప్పు కొట్టాడు. అంత మంది సెలబ్రిటీలు ఉండగా ప్రశాంత్ గెలుస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ, అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే ఆ ఆనందం కొన్ని గంటలు కూడా నిలవలేదు. అతని ఫ్యాన్స్ సృష్టించిన బీభత్సం అతనికి ఆ ఆనందం లేకుండా చేశాయి. అయితే ఇందులో ప్రశాతం తప్పిదం కూడా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని పోలీసులు చెబుతున్నా కూడా ప్రశాంత్ వినకుండా ర్యాలీ చేపట్టాడు. ఆ అల్లర్లకు సంబంధించి కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు ప్రశాంత్ ను పోలీసులు అతని సొంతూరికి వెల్లి అదుపులోకి తీసుకున్నారు.

పల్లవి ప్రశాంత్ పేరు గత రెండ్రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతూనే ఉంది. అతను కప్పు కొట్టడం ఒకెత్తు అయితే.. ఆ తర్వాత జరిగిన పరిమాణాలు మరింత హీటు పుట్టించాయి. ఇప్పుడు ఆ పరిణామాల కారణంగా పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులోని ఇంటి వద్ద ప్రశాంత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి వద్ద నుంచి ప్రశాంత్ ను పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. డిసెంబర్ 17న బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పేరిట నానా హంగామా జరిగింది. ప్రైవేటు వాహనాలు మాత్రమే కాకుండా ప్రభుత్వ వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. 6 ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనాన్ని పగలగొట్టారు. అలాగే అమర్ దీప్ కారు, అశ్వినీ శ్రీ కారు, గీతూ రాయల్ కార్లను కూడా ధ్వంసం చేశారు.

ఈ నేపథ్యంలోనే పల్లవి ప్రశాంత్, అతని ఫ్యాన్స్ మీద కూడా కేసులు నమోదు అయ్యాయి. తాను అజ్ఞాతంలోకి వెళ్లాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. వాటిని ఖండిస్తూ ప్రశాంత్ తాను ఇంటి దగ్గరే ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేశాడు. తాను ఎక్కడికీ పోలేదంటూ కొందరు మిత్రులు కూడా చెప్పుకొచ్చారు. తాజాగా పోలీసులు ప్రశాంత్ ను ఇంటి వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పల్లవి ప్రశాంత్ ను జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు. ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పీఎస్ లోనే కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వ, ప్రైవేటు ప్రాపర్టీలను డ్యామేజ్ చేశారు అనే అభియోగం మీదే కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ప్రశాంత్ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

పోలీసులు వద్దని వారిస్తున్నా కారు డ్రైవ్ చేసిన ఇద్దరిని పోలీసులు ఏ-4, ఏ-5గా చేర్చి అరెస్టు చేశారు. ఇప్పుడు నేరుగా ప్రశాంత్ నే అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ స్పందించాడు. తన ఫ్యాన్స్ ఇలాంటి పనులు చేయరంటూ వారించాడు. అసలు తన ఫ్యాన్స్ అయితే తనతో మంచిగా ఉన్న గీతూ రాయల్, అశ్వినీ శ్రీల కార్లు ఎందుకు ధ్వంసం చేస్తారని పరశ్నించాడు. అంతేకాకుండా అస్సులు ఆర్టీసీ బస్సులు ఎందుకు పగలగొడతారంటూ వ్యాఖ్యానించాడు. అసలు తనకు అమర్ కు ఎలాంటి విభేదాలు లేవని.. హౌస్ లో ఎంతో మంచిగా ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ప్రశాంత్ కు బెయిల్ కోసం అతని లాయర్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, ఎఫ్ఐఆర్ కాపీ లేకపోవడంతో తాము ఏమీ చేయలేని పరిస్థి అంటూ చెప్పుకొచ్చాడు. మరి.. పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి