iDreamPost
android-app
ios-app

స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న పాక్‌ టీమ్‌! ఆసియా కప్‌లో హోరాహోరీ పోరే

  • Published Aug 22, 2023 | 10:39 AM Updated Updated Aug 22, 2023 | 10:39 AM
  • Published Aug 22, 2023 | 10:39 AMUpdated Aug 22, 2023 | 10:39 AM
స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న పాక్‌ టీమ్‌! ఆసియా కప్‌లో హోరాహోరీ పోరే

మినీ వరల్డ్‌ కప్‌గా భావించే ఆసియా కప్‌ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఈ చిన్న సైజు వరల్డ్‌ కప్‌కు టాస్‌ పడనుంది. తాజాగా బీసీసీఐ కూడా ఆసియా కప్‌ 2023 కోసం టీమిండియాను ప్రకటించింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో 17 మందితో కూడిన స్క్వౌడ్‌ ఆసియా కప్‌ కోసం సిద్ధమవుతుంది. అయితే.. ఆసియా కప్‌ టోర్నీకే హైలెట్‌గా నిలిచే మ్యాచ్‌ ఏందని.. మినిమమ్‌ క్రికెట్‌ నాలెడ్జ్‌ ఉన్న కుర్రాడ్ని అడిగే చెప్పే ఆన్సర్‌.. ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌. సెప్టెంబర్‌ 2న ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు.

అయితే.. ఆసియా కప్‌ 2023 కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కొన్ని రోజుల ముందుగానే స్క్కౌడ్‌ను ప్రకటించింది. 18 మందితో కూడిన జట్టు నుంచి.. ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఏంటని క్రికెట్‌ నిపుణులు అంచనా వేస్తే పాకిస్థాన్‌ జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. బాబర్‌ అజమ్‌ కెప్టెన్సీలోని పాక్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ప్రత్యర్థి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే పోటీ అంత రసవత్తరంగా ఉంటుంది కదా. అందుకే ఈ సారి పాకిస్థాన్‌ టీమ్‌ ఎంత బలంగా ఉందో క్రికెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక సారి పాక్‌ ప్లేయింగ్‌ను అంచనా వేస్తే.. ఓపెనర్లుగా కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌, వికెట్‌ కీపర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ ఉన్నారు. వన్‌డౌన్‌లో ఫకర్‌ జమాన్‌ రావచ్చు ఇక మిడిల్డార్‌లో ఇమామ్‌ ఉల్‌ హక్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌, లోయర్‌ ఆర్డర్‌లో ఆల్‌రౌండర్లు షాదాబ్ ఖాన్‌, సల్మాన్‌ అలీ అఘా ఉన్నారు.

షాహీన్‌ షా అఫ్రిదీ, నసీమ్‌ షా, హరీష్‌ రౌఫ్‌తో పేస్‌ దళం కూడా దుర్భేద్యంగా ఉంది. షాదాబ్‌ ఖాన్‌, ఉసామా మీర్‌ స్పిన్‌ చూసుకుంటారు. ఇలా జట్టు ఎంతో సమతుల్యంతో ఉంది. అయితే.. పాకిస్థాన్‌ ఎంత బలంగా ఉన్నా కూడా టీమిండియా తమ స్థాయికి తగ్గట్లు ఆడితే.. పాక్‌ పసికూనే అవుతుంది. పైగా ఆసియా కప్‌, ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‌పై టీమిండియాకు తిరుగులేని రికార్డులు ఉన్నాయి. అయినా.. పాక్‌ బలంగా ఉంటేనే కదా.. టీమిండియాకు ఆటలో మజా వచ్చేది. బలమైన దాన్ని వేటాడితే కిక్కు.. బక్కచిక్కిన దాన్ని కొడితే ఏముంటుందంటూ.. భారత క్రికెట్‌ అభిమానులు ఇండియా-పాకిస్థాన్‌ టీమ్‌లను కంప్యార్‌ చేస్తున్నారు.

పాకిస్థాన్‌ ఆసియా కప్‌ 2023 స్క్వౌడ్‌:
బాబర్ అజమ్‌(కెప్టెన్‌), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హారీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రౌఫ్ , మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది.

ప్లేయింగ్‌ ఎలెవన్‌(అంచనా)
బాబర్‌ అజమ్‌, రిజ్వాన్‌, ఫఖర్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, సల​ఆమాన్‌ అలీ అఘా, నసీమ్‌ షా, షాహీన్‌ షా అఫ్రిదీ, ఉసామా మీర్‌, హరీష్‌ రౌఫ్‌.

ఇదీ చదవండి: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! ఆసియా కప్‌, వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు!