iDreamPost
android-app
ios-app

దారుణం: ప్రిన్సిపాల్ అరాచకం.. ప్రమోషన్స్ ఆశ చూపి మహిళా టీచర్లపై..!

  • Published Sep 06, 2023 | 8:49 PM Updated Updated Sep 06, 2023 | 8:49 PM
  • Published Sep 06, 2023 | 8:49 PMUpdated Sep 06, 2023 | 8:49 PM
దారుణం: ప్రిన్సిపాల్ అరాచకం.. ప్రమోషన్స్ ఆశ చూపి మహిళా టీచర్లపై..!

ఉపాధ్యాయ వృతిల్లో ఉన్న కొందరు గురువులు పాడు పనులకు తెర లేపుతున్నారు. చదువు పేరుతో విద్యార్థినులను సైతం లోబరుచుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటివి గతంలో చాలానే జరిగాయి. అయితే ఈ వరుస ఘటనలు మరువకముందే తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రమోషన్స్ పేరుతో ఏకంగా మహిళా టీచర్లపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అసలు విషయం బయటపడడంతో ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. పాకిస్తాన్ లోని కారాచీలో ఇర్ఫాన్ గఫూర్ మెమన్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇతగాడు చాలా కాలంగా స్కూల్లో పని చేస్తున్న మహిళా టీచర్లపై కన్నేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రమోషన్స్ ఇస్తానంటూ ఆశచూపి వారిని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతేకాకుండా వారితో సన్నిహితంగా మెలిగిన ఫోటోలతో బ్లాక్ మెయిల్ కు దిగేవాడట. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 45 మంది మహిళలపై ఇతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా సమాచారం.

ఇక అసలు విషయం బయటపడడంతో తాజాగా ఇర్ఫాన్ గఫూర్ మెమన్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు షాక్ గురవుతున్నారు. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. 45 మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇతగాడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio