SNP
SNP
మరో రెండు నెలల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించి ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. అన్ని జట్లు వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రానున్న ప్రపంచ కప్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు ఎలా ఉన్నాయో వివరిస్తూ.. ఈ సారి వరల్డ్ కప్ పాకిస్థాన్ గెలుస్తుందని అన్నాడు.
భారత్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగడం టీమిండియాకు కలిసొచ్చే అంశమే అయినా.. అది మిగతా జట్లకు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదని అన్నాడు. ఎందుకంటే.. ఐపీఎల్ కారణంగా చాలా మంది స్టార్ క్రికెటర్లకు భారత్‌లో ఉండే పిచ్‌లపై మంచి అవగాహన వచ్చిందని, ఏ పిచ్‌పై ఎలా ఆడాలి, ఏ బౌలర్‌ను ఎలా ఎదుర్కొవాలి అనే విషయంలో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు మంచి పట్టుదొరికిందని అన్నాడు. అలాగే విదేశీ బౌలర్లు కూడా ఐపీఎల్ ఆడారు. వారికి కూడా ఇక్కడి పిచ్‌లు అలవాటు అయ్యాయి. దీంతో వాళ్లు భారత్ పిచ్‌లపై పెద్దగా ఇబ్బంది పడరు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల ఆటగాళ్లు ఎక్కువగా ఐపీఎల్ ఆడుతున్నారు. వారికైతే ఇండియన్ పిచ్‌లు కొట్టిన పిండిలా మారాయని అభిప్రాయపడ్డాడు.
ఇక వరల్డ్ కప్ ఫేవరేట్స్‌లో పాకిస్థాన్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు కూడా ఉన్నాయని, కానీ.. అందరి కంటే పాకిస్థాన టీమ్‌కు ఈ వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెక్‌గ్రాత్ అన్నాడు. ముఖ్యంగా భారత్‌తో పోల్చుకుంటే.. పాకిస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా ఉందని, ఒక్క ఫీల్డింగ్ విషయంలో పాకిస్థాన్ టీమ్ మెరుగు పడితే.. వరల్డ్ కప్ వారిదేనని అన్నాడు. ఇక భారత్ పిచ్‌లు పేస్‌కు అంతగా అనుకూలించవని, ఇక్కడి పిచ్‌లు స్పిన్ బౌలింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు ఉంటాయని కూడా మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. మరి వరల్డ్ కప్‌లో టీమిండియా కంటే పాకిస్థాన్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెక్‌గ్రాత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Glenn McGrath’s World Cup 2023 Semi-final Predictions [TOI]:
– India, Australia, England, and Pakistan pic.twitter.com/z6B2K29975
— Vipin Tiwari (@vipintiwari952) August 5, 2023
ఇదీ చదవండి: వెంకటేశ్ ప్రసాద్.. ఇతనో చరిత్ర గుర్తించని ఇండియన్ మెక్‌గ్రాత్!