SNP
SNP
ఆసియా కప్ 2023కి ముందు పాకిస్థాన్ జట్టులో ఉత్సాహం పెంచేలా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టును పాక్ అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్-ఆస్ట్రేలియా 118 రేటింగ్‌తో సమంగా ఉన్నా.. పాయింట్ల పరంగా పాక్ ముందుంది. రేటింగ్‌లో ఆస్ట్రేలియా సమంగా ఉన్నా.. ఆ టీమ్ ఖాతాలో 2714 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. కానీ పాక్ టీమ్ 2725 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ క్లీన్‌స్వీప్ చేయడంతో ఆ జట్టు పాయింట్ల పెరిగాయి.
మరో మూడు రోజుల్లో పాకిస్థాన్-శ్రీలంక వేదికగా ఆసియా కప్ 2023, ఆ వెంటనే అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానున్న నేపథ్యంలో వరల్డ్ నంబర్ వన్ టీమ్‌గా పాకిస్థాన్ ఆ టోర్నీల్లో అడుగుపెట్టడం వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది. అయితే.. ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ అగ్రస్థానంలోకి దూసుకురాగా.. ఆస్ట్రేలియా రెండో స్థానానికి చేరుకుంది. ఇక టీమిండియా మూడో స్థానంలో కొనసాగుతోంది.
పాయింట్ల పరంగా టీమిండియా.. పాకిస్థాన్, ఆస్ట్రేలియా కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఏకంగా 4081 పాయింట్లతో వారికి అందనంత ఎత్తులో ఉన్నా.. రేటింగ్స్‌లో కేవలం ఐదు పాయింట్లు తక్కువగా ఉంది. ప్రస్తుతం భారత్ 113 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉంది. టీమిండియా తర్వాత.. న్యూజిలాండ్ 104 రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉంది. కివీస్ తర్వాత.. ఇంగ్లండ్ 101 రేటింగ్‌తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా, ఆసియా కప్ తర్వాత ర్యాంకింగ్స్‌లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్, పాక్ స్థానాల్లో మార్పులు ఉండొచ్చు. మరి పాక్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి స్థానం చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Congratulations team Pakistan 🇵🇰 earning NO.1 ODI ranked team in the world ❤️🇵🇰 pic.twitter.com/zax8OG3K8H
— Mohammad Hafeez (@MHafeez22) August 26, 2023
ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్ కి భారత్ నుంచి భారీ బృందం.. 634 మందితో..!