iDreamPost

రాష్ట్రపతి భవన్​పై దాడికి కుట్ర​! పోలీసులు అలర్ట్​

రాష్ట్రపతి భవన్​పై దాడికి కుట్ర​! పోలీసులు అలర్ట్​

భారత దేశ రాధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9,10 వ తేదీలో జీ-20 సదస్సు జరగనుంది. ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. దీంతో జీ-20 సదస్సును భారత దేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని సిద్దం చేసింది. జీ-20 అనేది 20 దేశాల సమూహం.. ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను చర్చించే విధిక. ఈ ఏడాది మనదేశంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రపతి భవన్ ని పేల్చేందుకు ఉగ్రమూకలు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెంట్ వర్గాలు గుర్తించడంతో అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలో ఈ ఏడాది జీ-20 ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారత్ అన్ని సిద్దం చేసింది. రేపు, ఎల్లుండి జరగబోయే జీ-20 సదస్సు ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, నేషనల్ వార్ మెమోరియల్ సహా పలు ప్రాంతాలను బాంబులతో విధ్వంసం చేయాలని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వెంటనే అధికారులు అప్రమత్తమై రక్షణ చర్యలు మరింత పటిష్టం చేశారు. బిహార్ కు చెంది బన్సీ ఝా అనే ఓ వ్యక్తి పాకిస్థాన్ కు గూడాఛారిగా వ్యవహరిస్తున్నాడని కోల్‌కొతా పోలీసులకు విశ్వనీయ వర్గాల ద్వారా సమాచారం అందడంతో వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం అక్కడి వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు.

బీహార్ లో బన్సీ ఝా ని అరెస్ట్ చేసిన తర్వాత పలు కీలక విషయాలు అతడి నుంచి రాబట్టారు ఎస్‌టీఎఫ్ అధికారులు. ఇటీవల కోల్‌కొతాకు వచ్చి బాలి వంతెనతో పాటు అక్కడే ఉన్న మరో ఆలయం, ఢిల్లీ, కోల్‌కొతా, చెన్నైలోని ప్రముఖ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను పాకిస్థాన్ లోని ఓ మహిళకు పంపించినట్లు ఎస్​టీఎఫ్​ డిటెక్టివ్​లు ఆరోపించారు. కాగా, ఆ మహిళ పాకిస్థాన్ ఇంటిలిజెన్స్​లో అనుమానిస్తున్నారు అధికారులు. మరోవైపు జీ-20 సదస్సు ను భగ్నం చేయాలనే ఉద్దేశంతో ఐసీఎస్ ఉగ్రవాద సంస్థలు భారీ కుట్రకు పన్నినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కోల్‌కొతా పోలీసులతో ఢిల్లీ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అవసరమైతే బన్సీ ఝా ని తమ కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలు రాబట్టాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఆగస్టు 29న బన్సీ ఝా ను ఎస్​టీఎఫ్​ బృందం అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి