iDreamPost

జైపూర్ ట్రైన్ కాల్పుల్లో హైదరాబాదీ మృతి.. ఆదుకోవాలంటూ KTRను కోరిన ఒవైసీ

జైపూర్ ట్రైన్ కాల్పుల్లో హైదరాబాదీ మృతి.. ఆదుకోవాలంటూ KTRను కోరిన ఒవైసీ

జైపూర్ ట్రైన్ కాల్పుల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ అధికారితో పాటు ముగ్గురు ప్రయాణికులు మరిణించినట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఈ కాల్పుల ఘటనలో మరణించిన వారిలో హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు కూడా ఉన్నట్లు తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. మరణించిన బాధితుడి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ ఆదుకోవాలంటూ ఆయన కోరారు. అసలేం జరిగిందంటే?

ఇటీవల మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలోని జైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ రైలులో ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) జవాన్ చేతన్ సింగ్ ప్రయాణికులపై కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఇతని కాల్పుల్లో ఓ అధికారితో పాటు ముగ్గురు ప్రయాణికులు మరణించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటన అనంతరం నిందితుడు అదే సమయంలో రైలు దూకి పారిపోయాడు. అనంతరం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, నిందితుడు మానసిక ఒత్తిడికి గురైన కారణంగానే ఇలా చేసి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. జైపూర్ ట్రైన్ కాల్పుల ఘటనలో హైదరాబాద్ నాంపల్లి బాజార్ ఘాట్ కు చెందిన సయ్యద్ సైఫుల్లా అనే వ్యక్తి మరణించాడు. ఇదే విషయాన్ని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇతనికి ఆరు నెలల వయసు ఉన్న కూతురు ఉందని, ఈ బాధిత కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ ఆదుకోవాలని ఆయన కోరారు.

ఇది కూడా చదవండి: వక్ఫ్ బోర్డు భూముల కబ్జా ఆరోపణలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి