iDreamPost

పెళ్ళాం ఊరెళ్తే.. భర్త వేరే అమ్మాయితో! ఇంత బోల్డ్ మూవీ గతంలో చూసుండరు!

OTT Suggestions- Must Watch Movies: ఓటీటీలో ఉన్న సినిమాల్లో ఏది చూడాలో ఒక పట్టాన అర్థం కాదు. అందుకే మీకోసం ఓటీటీ సజీషన్స్ రూపంలో మంచి సినిమాలను తీసుకొస్తున్నాం. ఈ మూవీలో యాక్టింగ్, ఎంటర్ టైన్మెంటే కాదు.. మంచి మెసేజ్ కూడా ఉంటుంది.

OTT Suggestions- Must Watch Movies: ఓటీటీలో ఉన్న సినిమాల్లో ఏది చూడాలో ఒక పట్టాన అర్థం కాదు. అందుకే మీకోసం ఓటీటీ సజీషన్స్ రూపంలో మంచి సినిమాలను తీసుకొస్తున్నాం. ఈ మూవీలో యాక్టింగ్, ఎంటర్ టైన్మెంటే కాదు.. మంచి మెసేజ్ కూడా ఉంటుంది.

పెళ్ళాం ఊరెళ్తే.. భర్త వేరే అమ్మాయితో! ఇంత బోల్డ్ మూవీ గతంలో చూసుండరు!

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఓపెన్ చేయగానే ఏ సినిమా చూడాలి? ఎలాంటి సినిమాలు చూడాలి? ఏ వెబ్ సిరీస్ బాగుంటుంది? ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు వస్తూనే ఉంటాయి. అలా క్లారిటీ లేకపోతే సినిమా కోసం వెతుక్కోవడానికే ఉన్న టైమ్ కాస్తా వేస్ట్ అయిపోతుంది. ఆ గ్యాప్ లో అసలు సినిమా చూడాలి అనే మూడు, ఉత్సాహం కాస్తా పోతుంది. అందుకే మేము ఓటీటీ సజీషన్స్ రూపంలో మంచి సినిమాలు, వెబ్ సిరీస్లు సజెస్ట్ చేస్తున్నాం. మంచి మంచి సినిమాలను సజీషన్స్ రూపంలో తీసుకొస్తున్నాం. అందులో భాగంగానే మీకోసం ఒక మంచి రొమాంటిక్ హ్యూమరస్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇది చూడటానికి కాస్త ఇంట్రెస్టింగ్ గా మాత్రమే కాకుండా.. ఎంటర్ టైనింగా కూడా ఉంటుంది.

సినిమాల్లో ఎన్నో జానర్స్ ఉంటాయి. వాటిలో రొమాన్స్ కూడా ఒక జానర్. ఈ జానర్లో కూడా చాలానే ఎంటర్టైనింగ్ మూవీస్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మెసేజ్ ఇచ్చేవి కూడా ఉన్నాయి. ఈ మూవీ కూడా అలాంటిదే. ఈ చిత్రం పేరు మన్మథ లీల. ఇది 2022లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అశోక్ సెల్వన్ హీరోగా చేశాడు. తెలుగు ప్రేక్షకులకు అశోక్ సెల్వన్ సుపరిచితుడే. ఈ మూవీలో అశోక్ సెల్వన్ యాక్టింగ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. అలాగే హీరోయిన్స్ గా చేసిన సంయుక్త హెగ్డే, రియాసుమన్, స్మృతి వెంకట్ కూడా యాక్టింగ్ లో ఇరగదీశారు.

ఈ మూవీలో స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. 2010, 2020 టూ టైమ్ లైన్స్ లో పార్లల్ గా సినిమా కథ నడుస్తూ ఉంటుంది. హీరో లైఫ్ లో జరిగిన లైఫ్ టర్నింగ్ మూమెంట్స్ అన్నీ ఈ మూవీలో ఆ రెండు టైమ్ లైన్స్ లో జరుగుతూ ఉంటాయి. ఈ రెండు సందర్భాల్లో కూడా హీరో సత్య లైఫ్ బ్రేక్ పాయింట్ కి చేరుకుంటుంది. అలాంటి సందర్భాల్లో అశోక్ సెల్వన్ యాక్టింగ్ చేసిన విధానం, కథలో సత్య సిట్చువేషన్స్ ని హ్యాండిల్ చేసిన తీరు అందరినీ మెస్మరైజ్ చేస్తుంది.

ఈ మన్మథ లీల సినిమాలో రొమాన్స్, బెడ్ రూమ్ సీన్స్, ఇల్లీగల్ ఎఫైర్స్, ప్రేమ పేరుతో చేసే తొందరపాటు చర్యలు అన్నీ కంగారు పెట్టడం మాత్రమే కాకుండా.. ఆలోచింపజేస్తాయి. అయితే ఇది ఏ సర్టిఫికేట్ మూవీ అనే విషయం గుర్తు పెట్టుకోండి. ఇంటిల్లపాది కలిసి కూర్చుని చూడాలి అంటే కాస్త ఇబ్బంది గానే ఉంటుంది. కాబట్టి దానికి తగిన విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. అయితే ఇది కంటెంట్ కాస్త బోల్డ్ గా ఉండచ్చు. కానీ, ఇందులో ఉండే మెసేజ్ మాత్రం కాస్త క్లియర్ గానే ఉంటుంది. మనకు ఎదురయ్యే సిట్చివేషన్స్, మనం తీసుకునే నిర్ణయాలను బట్టే లైఫ్ ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా మన్మథ లీల మూవీలో చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి