iDreamPost

NSG కమాండో అవ్వడం ఇంత కష్టమా? OTTలో ఉంది మీరూ చూసేయండి..

OTT Suggestions- Inside NSG: ఓటీటీలో ఇప్పటివరకు చాలానే సినిమాలు చూసుంటారు. ఎన్నో వెబ్ సిరీస్లు చూసుంటారు. ఈసారి ఈ డాక్యుమెంటరీ ఒకసారి చూడండి. దేశం కోసం వీళ్లు ఎంత కష్టపడుతున్నారో అర్థం అవుతుంది.

OTT Suggestions- Inside NSG: ఓటీటీలో ఇప్పటివరకు చాలానే సినిమాలు చూసుంటారు. ఎన్నో వెబ్ సిరీస్లు చూసుంటారు. ఈసారి ఈ డాక్యుమెంటరీ ఒకసారి చూడండి. దేశం కోసం వీళ్లు ఎంత కష్టపడుతున్నారో అర్థం అవుతుంది.

NSG కమాండో అవ్వడం ఇంత కష్టమా? OTTలో ఉంది మీరూ చూసేయండి..

ఓటీటీలో ఇప్పటివరకు చాలానే సినిమాలు చూసి ఉంటారు. వాటిలో కొన్ని ఆనందాన్ని ఇస్తే.. మరికొన్ని ఆహ్లాదాన్ని ఇచ్చి ఉంటాయి. కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు మీకు భలే ఉన్నాయి అనే భావన కలిగించి ఉంటాయి. కానీ, ఎప్పుడైనా ఓటీటీలో ఒక సినిమా గానీ, ఒక వెబ్ సిరీస్ గానీ చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయా? ఎప్పుడైనా కళ్లు చెమ్మగిల్లాయా? ఒకవేళ అలాంటి అనుభూతిని మీరు పొంది ఉండకపోవచ్చు. ఇప్పుడు మేము చెప్పే వీడియో డాక్యుమెంటరీ చూస్తే మాత్రం మీకు తెలియకుండానే ఏడ్చేస్తారు. మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మన కోసం ఎంత మంది ప్రాణత్యాగానికి సైతం సిద్ధంగా ఉన్నారో తెలుస్తుంది. ఇన్నాళ్లు ఇలాంటి ఒక వీడియో చూడలేకపోయామే అనే భావన కలుగుతుంది.

మీకు మేము సాధారణంగా ఓటీటీ సజీషన్స్ ఇస్తున్నాం. వాటిలో ఫలానా సినిమా బాగుంది చూడండి. ఫలానా వెబ్ సిరీస్ బాగుంది మిస్ కాకండి అని చెప్పుకొచ్చాం. కానీ, మొదటిసారి మీకోసం ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ని తీసుకొచ్చాం. అది చూడటం మాత్రం అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఆ డాక్యుమెంటరీ మన దేశం గురించి, మనకోసం ప్రాణత్యాగం చేసే జవాన్ల గురించి. దేశాని, దేశ ప్రజలకు ఏ కష్టం వచ్చినా బుల్లెట్లకు గుండెను అడ్డుపెట్టే NSG కమాండోలది. మేజర్ సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో ఉన్ని కృష్ణన్ త్యాగం చూసి అందరి కళ్తు చెమ్మగిల్లాయి. అయితే వాళ్లకి మన కోసం ప్రాణత్యాగం చేయడానికి అవకాశం అంత తేలిగ్గా రాదు. అందుకోసం కూడా ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది.

Inside NSG3

బ్లాక్ క్యాట్ కమాండో అయ్యేందుకు దాదాపు 6 వారాలపాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తారు. ఈ శిక్షణలో వాళ్లు ఎదుర్కొనే కఠోర శిక్షణ చూస్తే చావు కూడా ఇంతకన్నా సుఖంగా ఉంటుందేమో అనిపిస్తుంది. అయితే వాళ్లు ఇప్పుడు అంత కఠోర శిక్షణ తీసుకోకపోతే రేపు దేశాన్ని ఎలా కాపడతారు అంటారు. ఆ 6 వారాల్లో వాళ్లకి ఇచ్చే శిక్షణ, వారికి ఎదురయ్యే సవాళ్లు, వాటిని వాళ్లు అధిగమించే తీరు అన్నింటిని వివరిస్తూ.. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ‘ఇన్ సైడ్ NSG’ అంటూ ఒక డాక్యుమెంటరీ చేసింది. ప్రస్తుతం ఆ డాక్యుమెంటరీ డిస్నీప్లస్ హాట్ స్టార్ యాప్, యూట్యూబ్ లో నేషనల్ జియోగ్రాఫిక్ ఇండియా యూట్యూబ్ ఛానల్ లో అందుబాటులో ఉంది. 45 నిమిషాల నిడివి గల వీడియో ఉంది.

ఒక బ్లాక్ క్యాట్ కామాండోగా ఎలా తయారవుతారు? దేశం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా ఎలా సంసిద్ధంగా ఉంటారు అనే విషయాలను తెలుసుకోవచ్చు. ఈ జవాన్లకు ఇంకో పేరు కూడా ఉంటుంది. అది బలిదాన్ స్క్వాడ్ అంటారు. అంటే మీరు ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితిలో అయినా దూసుకొచ్చే బుల్లెట్ కు మీ శరీరాన్ని అడ్డు పెట్టడానికి కూడా వెనుకాడకూడదు. అసలు ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటే ఎవరు? వీళ్ల ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి? ట్రైయినింగ్ ఎంత కష్టంగా ఉంటుంది? పరిస్థితి చేయి దాటిపోతే వీళ్లు ఆ సిట్యువేషన్స్ ని ఎలా కంట్రోల్ చేస్తారు? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ ఇన్ సైడ్ ఎన్ఎస్జీ వీడియో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి