iDreamPost

OTTలో ప్రపంచం మెచ్చిన మూవీ! డబ్బు ఇలా కూడా సంపాదించవచ్చా?

OTT Suggestions- Best Romantic Action Drama; మీరు ఇప్పటి వరకు ఓటీటీల్లో చాలానే సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక మూవీని మాత్రం చూసుండరు. ఇప్పటికీ ఓటీటీలో ఈ చిత్రం ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

OTT Suggestions- Best Romantic Action Drama; మీరు ఇప్పటి వరకు ఓటీటీల్లో చాలానే సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక మూవీని మాత్రం చూసుండరు. ఇప్పటికీ ఓటీటీలో ఈ చిత్రం ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

OTTలో ప్రపంచం మెచ్చిన మూవీ! డబ్బు ఇలా కూడా సంపాదించవచ్చా?

మీరు ఇప్పటి వరకు చాలా సినిమాలు చూసుంటారు. కానీ, అందరికీ అన్నీ నచ్చవు. కొందరికి ఒక సినిమా నచ్చాలి అంటే అది పెద్ద ప్రహసనం అనే చెప్పాలి. కానీ, కొన్ని సినిమాలు యావత్ ప్రపంచాన్నే ఊపేస్తాయి. అలాంటి సినిమాలు ఇప్పటికే వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యాయి. తమ మార్క్ ని చూపించాయి. అలాగే అవి ఓటీటీల్లో కూడా అద్భుతమైన ఆదరణను పొందాయి. ఇప్పటికీ పొందుతూనే ఉన్నాయి. అలాంటి ఒక సినిమాని మీకోసం తీసుకొచ్చాం. ఆ మూవీ ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి మాత్రం చూడకండి. కచ్చితంగా ఒంటరిగానే చూడాల్సిన సినిమా ఇది.

సాధారణంగా ఒక సినిమా వచ్చింది అంటే కొన్నిరోజులకు అందరూ దాని సంగతి మర్చిపోతారు. కానీ, 11 ఏళ్లు గడుస్తున్నా కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఓటీటీలో ఇప్పటికీ ఆ మూవీని చూస్తూనే ఉన్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో ఆ మూవీ తాలుకు రిఫరెన్సెస్ కనిపిస్తూనే ఉన్నాయి ఇన్నేళ్లు గడుస్తున్నా ఆ మూవీ ఇంపాక్ట్ మాత్రం తగ్గడం లేదు. ఇంత హైప్ ఇస్తున్న మూవీ మరేదో కాదు.. లియోనార్డో డికాప్రియో లీడ్ రోల్ ప్లే చేసిన ‘ది ఉల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’. హాలీవుడ్ హిస్టరీలోనే ఈ చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా లవర్స్ తో కల్ట్ క్లాసిక్ అనే బిరుదును అందుకుంది.

మార్టిన్ స్కోర్సెస్ తెరకెక్కించిన ఈ ఉల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ చిత్రం 2013లో విడుదలైంది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్ ప్లే చేసిన లియోనార్డో డికాప్రియోకి ఉత్తమ నటుడిగా ఆస్కార్ నామినేషన్ దక్కింది. అలాగే జోనా హిల్ కు ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ నామినేషన్ దక్కింది. ఈ చిత్రాన్ని 100 మిలియన్ డాలర్లు పెట్టి నిర్మిస్తే.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 400 మిలియన్ డాలర్లకు పైపా కలెక్షన్స్ రాబట్టింది. ఇంక ఇందులో ఉండే సీన్స్ గురించి అయితే ఇక్కడ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అంత ఓపెన్ గా ఆ సీన్స్ గురించి డిస్కస్ చేయలేం కాబట్టి.

ఇంక ఈ ఉల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ మూవీ కథ విషయానికి వస్తే.. హీరో వాల్ స్ట్రీట్ లో ఒక పెద్ద కంపెనీలో స్టాక్ బ్రోకర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతను చాలా టాలెంట్ కలిగిన వ్యక్తి. అయితే ఉన్న పళంగా ఉద్యోగం పోతుంది. ఏం చేయాలో తెలియదు. అందుకే ఒక అనామక కంపెనీకి వెళ్తాడు. అక్కడ వారికి అసలు స్టాక్ బ్రోకరింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాడు. వారికి ఒక స్క్రిప్ట్ రెడీ చేసి అందరినీ గైడ్ చేస్తాడు. ఇంకేముంది.. ఒక్కడే వచ్చి ఏకంగా వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ తర్వాత పార్టీలు, జల్సాలు అంటూ అబ్బో చాలానే కథలు ఉంటాయి. అయితే అతను ఎలా ఎదిగాడు? ఎలా పతనమయ్యాడు అనేదే కథ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి