iDreamPost

అత్త కావాల్సిన ఆమె పిన్నిగా.. తండ్రి లవ్ స్టోరీతో కొడుకుకి కష్టాలు! OTTలో బెస్ట్ మూవీ!

OTT Suggestions- Must Watch Love Story: ఓటీటీలో మీరు చాలానే లవ్ స్టోరీలు చూసి ఉంటారు. కానీ, ఇలాంటి ఒక క్రేజీ లవ్ స్టోరీ మాత్రం చూసి ఉండరు. అందరూ ఈ మూవీ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.

OTT Suggestions- Must Watch Love Story: ఓటీటీలో మీరు చాలానే లవ్ స్టోరీలు చూసి ఉంటారు. కానీ, ఇలాంటి ఒక క్రేజీ లవ్ స్టోరీ మాత్రం చూసి ఉండరు. అందరూ ఈ మూవీ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.

అత్త కావాల్సిన ఆమె పిన్నిగా.. తండ్రి లవ్ స్టోరీతో కొడుకుకి కష్టాలు! OTTలో బెస్ట్ మూవీ!

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని సినిమాలు చూడటలం చాలా తేలిక అయిపోయింది. గతంలో అంటే అలాంటి సినిమాలు చూడాలి అంటే ఎన్నో కష్టాలు పడే వాళ్లు. ఇప్పుడు అంత ఇబ్బంది లేదు. ఏ జానర్ మూవీ చూడాలి అన్నా ఇంట్లో కూర్చుని చూసేయచ్చు. అయితే ఇప్పుడు అలాంటి మూవీస్ లో కూడా మంచి మంచి కథ, స్క్రీన్ ప్లే, మంచి మంచి సీన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు చెప్పుకునే సినిమా కాస్త అలాంటి కోవకు చెందిందే. అయితే కథ మాత్రం కాస్త విచిత్రంగా, వినడానికి కాస్త విడ్డూరంగా ఉంటుంది. కానీ, చూసేటప్పుడు మాత్రం ప్రతి సీన్, ప్రతి ఎమోషన్, ప్రతి క్యారెక్టర్ ని ఎంజాయ్ చేస్తారు.

సాధారణంగా కాస్త బో*ల్డ్ కంటెంట్ ఉండే చిత్రాలు చూడటానికి కొంత మంది ఇష్టపడరు. కానీ, అలాంటి సినిమాల్లో కూడా మంచి కథ, స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎమోషన్స్, ట్విస్టులు, మలుపులు అంటూ చాలానే ఉంటాయి. ముఖ్యంగా హాలీవుడ్ నుంచి వచ్చే ఇలాంటి లవ్ స్టోరీలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. మూవీస్ కేటగిరీలో టాప్ 10లో 4వ స్థానంలో కొనసాగుతోంది. అంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. పైగా ఇది మరీ ఫుల్ లెంగ్త్ అడ*ల్ట్ కంటెంట్ మూవీ కూడా కాదు. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ నుంచి యూఏ సర్టిఫికేట్ లభించింది. మరి.. ఆ మూవీ ఏది? ఆ చిత్రం ఎందుకు అంత స్పెషల్ అనే విషయాలు తెలుసుకుందాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న మూవీ పేరు ‘మదర్ ఆఫ్ ది బ్రైడ్’. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. పైగా ఇంగ్లీష్ మాత్రమే కాకుండా.. తెలుగులో కూడా మీరు ఈ మూవీని చూసేయచ్చు. హాలీవుడ్ చిత్రాలను తెలుగు డబ్బింగ్ లో చూస్తే మంచి ఫీల్ ఉంటుంది. పైగా ఇలాంటి రొమాం*టిక్ కామెడీ మూవీస్ అయితే ఇంకా కిక్ ఇస్తాయి. అంతేకాకుండా ఈ మూవీలో అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా ఉంటాయి. అప్పుడు మాత్రం ఫ్యామిలీ చూడాలంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఎంత యూఏ సర్టిఫికేట్ అయినా కూడా ఒంటరిగా చూసేందుకు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఈ మూవీ లైన్ కామెడీగా ఉన్నా.. తెలుగు ఆడియన్స్ కి కాస్త ఎబ్బెట్టుగా ఉండచ్చు.

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమలో పడతారు. వారు గ్రాండ్ గా పెళ్లి ప్లాన్ చేసుకుంటారు. ఆ సమయంలో అసలు విషయం తెలుస్తుంది. అదేంటంటే.. పెళ్లికూతురు తల్లి, పెళ్లి కొడుకు తండ్రి ఇద్దరూ గతంలో ప్రేమించుకుంటారు. వాళ్లు ఎంతో క్లోజ్ గా గడుపుతారు. వారి మధ్య ఒక మంచి బాండ్ ఉండేది. ఆ తర్వాత అక్కడి వాతావరణం అంతా మారిపోతుంది. మరి.. ఆ అబ్బాయి- అమ్మాయి పెళ్లి జరిగిందా? తల్లి కావాల్సిన మహిళ అత్తగా వచ్చిందా? కొడుకు- కూతురు గురించి పక్కన పడేసి మళ్లీ వాళ్లు ప్రేమను స్టార్ట్ చేశారా? అనే విషయాలు తెలియాలి అంటే మీరు నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ మదర్ ఆఫ్ ది బ్రైడ్ మూవీ చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి