iDreamPost

OTTలో సూపర్ హారర్ థ్రిల్లర్.. ఒక్కరే చూడాలంటే ధైర్యం కూడగట్టుకోవాలి!

OTT Suggestions : ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, మంచి సినిమా చూడాలి అంటే ఒక పట్టాన దొరకవు. అందుకే మీకోసం ఒక మంచి హారర్ చిత్రాన్ని ఓటీటీ సజీషన్ గా తీసుకొచ్చాం.

OTT Suggestions : ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, మంచి సినిమా చూడాలి అంటే ఒక పట్టాన దొరకవు. అందుకే మీకోసం ఒక మంచి హారర్ చిత్రాన్ని ఓటీటీ సజీషన్ గా తీసుకొచ్చాం.

OTTలో సూపర్ హారర్ థ్రిల్లర్.. ఒక్కరే చూడాలంటే ధైర్యం కూడగట్టుకోవాలి!

పదుల సంఖ్యలో థియేటర్లలో సినిమాలు విడుదల అవుతున్నాయి. ఓటీటీల్లో అయితే వారానికి 20కి పైగా సినిమాలు వస్తున్నాయి. ఒక్కోసారి పది సినిమాలు విడుదల అయినా మనం చూసేవి.. మనకు ఒక పట్టాన నచ్చే సినిమాలు వాటిలో ఉండకపోవచ్చు. ఎవరో ఒకరు ఒక మంచి ఓటీటీ సినిమా సజెస్ట్ చేస్తే బాగుండు అని కూడా అనిపిస్తుంది. అలాంటి వారి కోసం మేము ఓటీటీ సజీషన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఒక అదిరిపోయే సూపర్ న్యాచురల్ హారర్ చిత్రాన్ని మీకోసం తీసుకొచ్చాం. ఈ సినిమాని చూడాలంటే మీరు కాస్త ధైర్యం అప్పు తెచ్చుకోవాలి మరి.

ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వస్తాయి. అయితే వాటిలో ఏ సినిమా చూడాలో ఎవరికీ క్లారిటీ ఉండదు. ఒక్కోసారి ఎప్పుడో ఓటీటీలోకి సినిమాలు వచ్చే ఉంటాయి. కానీ, మనకి వాటి గురించి తెలియక చూడకుండా ఉండిపోతాం. అలాంటి సినిమాల్లో ఇప్పుడు చెప్పుకునే భూతకాలం సినిమా కూడా ఒకటి. ఈ మూవీ జనవరి 21 2022లో సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమాని రాహుల్ సదాశివన్ తెరకెక్కించాడు. ఈ మూవీలో రేవతి, షేన్ నిగమం, సజ్జు కురుప్, జేమ్స్ ఎలియా వంటి వాళ్లు లీడ్ రోల్స్ ప్లే చేశారు.

ఈ భూతకాలం సినిమా కథ మొత్తాన్ని రేవతి సింగిల్ హ్యాండెడ్ గా పుల్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రంలో రేవతి నటనకు గానూ 2022 కేరళ స్టేట్ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. రేవతి కొడుకు పాత్రలో షేన్ నిగం కూడా అద్భుతంగా నటిస్తాడు. తల్లి దగ్గర ఎన్నో విషయాలను దాస్తూ తనకంటూ ఒక లైఫ్ ఉండాలి అని తిప్పలు పడుతూ ఉంటాడు. ఇది చాలా సింపుల్ స్టోరీ. కానీ, చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుంది? అసలు వారి జీవితాల్లో ఏం జరుగుతోంది? అనే విషయాలు మాత్రం తెలియక, తెలుసుకోవాలి అనే ఇంట్రస్ట్ ని రేకెతిస్తూ మూవీ ముందుకు సాగుతుంది.

కథ ఏంటంటే?:

ఆశా(రేవతి) ఒక స్కూల్ టీచర్. ఆమెకు విను(షేన్ నిగమ్) అనే కొడుకు ఉంటాడు. విను భీఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగం కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. రెండేళ్లు గడుస్తూన్నా అతనికి ఉద్యోగం రాదు. పైగా మానేసిన స్మోకింగ్, డ్రింకింగ్ కూడా స్టార్ట్ చేస్తాడు. వినుకి ఉద్యోగం రాకపోవడం, మల్లీ చెడు అలవాట్లు స్టార్ట్ చేయడంతో ఆశాకి విసుగొస్తుంది. ఎంత చెప్పినా వినకపోవడంతో వినుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ ఇంట్లో ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మొదటి అవన్నీ తల్లి చేస్తోంది అనుకుంటాడు. కానీ, ఆ తర్వాత ఇంకెవరో ఉన్నారు అనే విషయం గ్రహిస్తాడు. అసలు ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు? విను- ఆశ.. ఆ సూపర్ న్యాచురల్ పవర్ నుంచి తప్పించుకున్నారా? భూతకాలం(పాస్ట్)లో ఆ ఇంట్లో అసలు ఏం జరిగింది? ఇంతకీ విను- ఆశ సేఫ్ గా ఉన్నారా? అనేదే కథ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి