iDreamPost

వరుసగా జవాన్ల హత్య.. OTTలో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. చూశారా?

OTT Suggestions: ఓటీటీలో చాలానే యాక్షన్ సిరీస్లు ఉన్నాయి. వాటిలో ఏది చూడాలో చాలామందికి క్లారిటీ ఉండదు. అందుకే మీకోసం ఒక గొప్ప యాక్షన్ సిరీస్ ని తీసుకొచ్చాం.

OTT Suggestions: ఓటీటీలో చాలానే యాక్షన్ సిరీస్లు ఉన్నాయి. వాటిలో ఏది చూడాలో చాలామందికి క్లారిటీ ఉండదు. అందుకే మీకోసం ఒక గొప్ప యాక్షన్ సిరీస్ ని తీసుకొచ్చాం.

వరుసగా జవాన్ల హత్య.. OTTలో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. చూశారా?

ఓటీటీలు వచ్చిన తర్వాత ఏ సినిమాని కూడా ఆడియన్స్ వదలడం లేదు. రోజుకో సినిమా వెతుక్కుని చూడాలి అన్నా కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకేనేమో ఎక్కువగా వెబ్ సిరీస్లు చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే వెబ్ సిరీస్ చూడాలి అని ఫిక్స్ అవ్వడానికి ముందు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్ట్ చేసిన తర్వతా బోర్ కొడితే టైమ్ వేస్ట్ చేశామనే భావన కలుగుతుంది. అందుకే మీకోసం కొన్ని బెస్ట్ వెబ్ సిరీస్లను రికమెండ్ చేస్తున్నాం. ఆ జాబితాలో ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ గురించి చెప్పబోతున్నాం. ఈ సిరీస్ ని మీరు కచ్చితంగా ఇష్టపడతారు.

యాక్షన్ చిత్రాలు, వెబ్ సిరీస్లు చూసే వారికి ఈ వెబ్ సిరీస్ తెగ నచ్చేస్తుంది. ఇది రీచర్ అనే ఒక మంచి యాక్షన్ డ్రామా. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ఐఎండీబీలో 8/10 రేటింగ్ ఉంది. ఇది 2022లో విడుదలైంది. మొదటి సీజన్లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాల వరకు నిడివి కలిగి ఉంటాయి. రెండో సీజన్ కూడా 2022లోనే విడుదలైంది. ఈ సీజన్ లో కూడా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ లు కలిగి ఉంటుంది. తొలి సీజన్ మొత్తం రీచర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఒక మారుమూల పల్లెటూరుకు రీచర్ వెళ్తాడు.

తాను అసలు అక్కడికి ఎందుకు వెళ్లాడు అనే విషయం ఎవరికీ తెలియదు. అతనిక ఒక ఐడీ ఉండదు, తన దగ్గర ఫోన్ ఉండదు, అసలు ఆ ఊరికి ఎందుకు వచ్చాడో కూడా ఎవరికీ తెలియదు. రీచర్ అడుగుపెట్టిన తర్వాత ఆ ఊరిలో ఊహించని రీతిలో హత్యలు జరుగుతూ ఉంటాయి. అందరి దృష్టి రీచర్ మీద పడుతుంది. ఒక డిటెక్టివ్ కూడా రీచర్ నే అనుమానిస్తాడు. కానీ, తర్వాత వాళ్లు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇద్దరూ కలిసి మిస్టరీ మర్డర్స్ కేసును సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మరోవైపు రీచర్ తన పర్సనల్ కేసును కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అతనికి రోజుకో సవాలు ఎదురవుతూ ఉంటుంది. అలా అన్ సాల్వ్డ్ కేస్ తో తొలి సీజన్ ముగుస్తుంది.

దానికి కంటిన్యుటీగా రెండో సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్ లో అసలు విషయం ఏంటి అనేది చూపిస్తారు. రీచర్ తో కలిసి పని చేసిన ఎక్స్ జవాన్లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తూ ఉంటారు. మొదటి వ్యక్తిని హెలికాప్టర్ నుంచి అడవుల్లో పడేసి హత్య చేస్తారు. అలా అతని టీమ్ లో ఉన్న ఒక్కొక్కరిని వేటాడటం మొదలు పెడతారు. రీచర్ ఆ విషయం తెలుసుకుని అనధికారికంగా ఆ కేసును దర్యాప్తు చేస్తూ ఉంటాడు. అతనికి సపోర్ట్ గా తన పాత్ టీమ్ మెంబర్స్ వస్తారు. వారికి అడుగడుగా సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తారు. అసలు వారిని ఎవరు చంపుతున్నారు? రీచర్ హంతకులను పట్టుకున్నాడా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే అమెజాన్ ప్రైమ్ లో రీచర్ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి