iDreamPost

అన్నదమ్ములే శత్రువులు.. OTTలో ఈ యాక్షన్ డ్రామాకు పిచ్చెక్కిపోతారు!

Best Action Drama OTT Suggestions: ఓటీటీలో సినిమాలు చూడాలి అంటే ఒకపట్టాన తేల్చుకోలేం. అందుకే ఒక బెస్ట్ యాక్షన్ డ్రామా మీకోసం తీసుకొచ్చాం.

Best Action Drama OTT Suggestions: ఓటీటీలో సినిమాలు చూడాలి అంటే ఒకపట్టాన తేల్చుకోలేం. అందుకే ఒక బెస్ట్ యాక్షన్ డ్రామా మీకోసం తీసుకొచ్చాం.

అన్నదమ్ములే శత్రువులు.. OTTలో ఈ యాక్షన్ డ్రామాకు పిచ్చెక్కిపోతారు!

సినిమా లవర్స్ అభిరుచులు ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి. అందరికీ ఒకే జానర్ సినిమాలు నచ్చాలని రూలేం లేదు. కానీ, అందరూ యాక్షన్ డ్రామాలంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే భాషతో సంబంధం లేకుండా యాక్షన్ డ్రామాలు సూపర్ హిట్లుగా నిలుస్తూ ఉంటాయి. అలాంటి ఒక థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో అన్నదమ్ములే శత్రువులుగా మారతారు. ఈ మూవీని ఇప్పటివరకు చూడకపోతే మాత్రం మంచి సినిమా మిస్ అయిన వాళ్లు అవుతారు. మరి.. ఆ సినిమా ఏంటి? అందులో అంత స్పెషల్ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటోంది.. ఇంత హైప్ ఇచ్చింది.. భీష్మపర్వం సినిమా గురించి. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. 2022 మార్చి 3న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. మంచి లవ్ స్టోరీలు కూడా ఉన్నాయి. ఇదంతా రెండు కుటుంబాలకు సంబంధించిన కథ. ఇందులో ఒకరిపై ఒకరు పైచేయి కోసం పరోక్షంగా తలపడుతూ ఉంటాయి. ఒకరిది ఉనికి కోసం పోరాటం అయితే.. ఇంకొకరిది అధికారం కోసం వెంపర్లాట.

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ రెండూ కుటుంబాలు కజిన్స్ కావడం గమనార్హం. కులాంతర వివాహంతో కుటుంబంలో కుమ్ములాట మొదలవుతుంది. అది ఎంతకీ చల్లారదు. అయితే రెండు కుటుంబాలను ఒక దారికి తీసుకురావడానికి కుటుంబ పెద్దగా ఉన్న మైకేల్(మమ్ముట్టీ) పావులు కదుపుతూ ఉంటాడు. అవును ఈ మూవీలో మమ్ముట్టీ కూడా ఉన్నారు. ఆయన పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుంది. మైకేల్ ఒక మాట చెబితే దానిని ఎవరూ దాటడానికి లేదు. అలా రెండు కుటుంబాల మధ్య ఒక వారదిగా మైకేల్ ఉంటూ ఉంటాడు. ఇందులో టాలీవుడ్ రంగమ్మత్త అనసూయ కూడా నటించింది. మైకేల్ ప్రియురాలు అలీస్ గా అనసూయ యాక్ట్ చేసి మెప్పించింది.

ఈ మూవీ కథ ఏంటంటే?:

1980ల్లో కొచ్చీలో ఈ కథ మొదలవుతుంది. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యత మైకేల్ తీసుకుంటాడు. మైకేల్ కు నలుగురు తోబుట్టువులు ఉంటారు. తన అన్న ఒక ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత అతను చనిపోతాడు. ఆమె ఆ కుటుంబానికి దగ్గరగా ఉండే అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. అతనితో ఇద్దరు పిల్లలను కూడా కంటుంది. మైకేల్ వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోతాడు. మరోవైపు అతని సోదరుడు మథాయ్ కి ఇద్దరు కొడుకులు ఉంటారు. వారికి మైకేల్ అంటే అస్సలు పడదు. కానీ భయంతో మైకేల్ మాట వింటూ ఉంటారు. మైకేల్ వదిన పిల్లలు కూడా ఈ కుటుంబంతో అనుబంధంగా ఉండాలని చూస్తూ ఉంటారు. కానీ, ఈ కుటుంబం రానివ్వదు. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు, గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవి చాలాదూరం వెళ్తాయి. ఇవన్నీ మైకేల్ చూస్తూ ఉంటాడు. అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటాడు. కానీ, అవి మైకేల్ చేయి దాటిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. మరి.. అప్పుడు మైకేల్ ఏం చేశాడు అనేదే కథ. మరి.. ఈ భీష్మపర్వం మూవీ మీరు చూశారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి