iDreamPost

ఆస్కార్ సహా 100 అవార్డులు.. బ్లాక్ బస్టర్ మూవీ OTTలో తెలుగులో స్ట్రీమింగ్!

OTT Suggestions- Oscar Winning Movie: ఓటీటీలో ఏ మూవీ మిస్ అయినా కూడా అకాడమీ అవార్డు విన్నింగ్ మూవీ అస్సలు మిస్ కాకూడదు. అలాంటి ఆస్కార్ మాత్రమే కాకుండా వందకు పైగా అవార్డులు దక్కించుకున్న చిత్రం తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Suggestions- Oscar Winning Movie: ఓటీటీలో ఏ మూవీ మిస్ అయినా కూడా అకాడమీ అవార్డు విన్నింగ్ మూవీ అస్సలు మిస్ కాకూడదు. అలాంటి ఆస్కార్ మాత్రమే కాకుండా వందకు పైగా అవార్డులు దక్కించుకున్న చిత్రం తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆస్కార్ సహా 100 అవార్డులు.. బ్లాక్ బస్టర్ మూవీ OTTలో తెలుగులో స్ట్రీమింగ్!

ఓటీటీలో అన్నీ సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. కానీ, ఆడియన్స్ అన్నింటినీ చూడలేరు. కానీ, కొన్నింటిని మాత్రం అస్సలు మిస్ కాకూడదు. అలాంటి వాటిలో అకాడమీ అవార్డు విన్నింగ్ మూవీస్ కచ్చితంగా ఉంటాయి. ఏది మిస్ అయినా ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సినిమాలను మాత్రం మూవీ లవర్స్ మిస్ చేసుకోరు. తాజాగా 96వ ఆస్కార్ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ అందులో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. మరి.. ఆ మూవీ ఏది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? ఏయే భాషల్లో స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటోంది.. ఇంత హైప్ ఇస్తోంది ఆస్కార్ అవార్డు సహా వందకు పైగా అవార్డులు దక్కించుకున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించి. ఆ సినిమా పేరు ‘అనాటమీ ఆఫ్ ఏ ఫాల్’. ఈ ఫ్రెంచ్ థ్రిల్లర్ సినిమా 2023లో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా తెలుగు సహా తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ గురించి వరల్డ్ వైడ్ గా బాగానే బజ్ నడిచింది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ మూవీకి మరో ఆస్కార్ అవార్డు కూడా దక్కుతుందని అంతా భావించారు.

అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ మూవీలో లీడ్ రోల్ ప్లే చేసిన సాండ్రా హల్లర్ కు ఉత్తమ నటి విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కుతుందని అంతా భావించారు. కానీ, ఆమెకు తృటిలో ఆ అవకాశం తప్పిపోయింది. పూర్ థింగ్స్ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసిన ఎమ్మా స్టోన్ కు ఆస్కార్ దక్కింది. ఈ పూర్ థింగ్స్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. సినిమా నిండా సీనుకో ట్విస్ట్ ఉంటుంది. సాండ్రా హల్లర్ ఈ మూవీలో ఒక రచయిత పాత్ర పోషిస్తుంది. తన కుటుంబంతో కలిసి మంచు కొండల్లో ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఓ రోజు తన భర్త అనుకోకుండా పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోతాడు. అది ప్రమాదమో? హత్యో? తేల్చుకోలేని పరిస్థితి.

పోలీసులు మాత్రం సాండ్రా తన భర్తని హత్య చేసిందని ఫిక్స్ అయిపోతారు. ఆ సమయంలో అక్కడ ఆమె తప్పితే మరెవరూ లేరు. తాను ఆ హత్య చేయలేదు అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఆమెకు వస్తుంది. కానీ, తన నిర్దేషిత్వాన్ని నిరూపించుకునేందుకు కావాల్సిన ఆధారాలు లేవు. తన కుమారుడు కూడా తండ్రిని అమ్మే హత్య చేశాడనే నమ్మే పరిస్థితి వస్తుంది. అప్పుడు సాండ్రా హల్లర్ ఏం చేసింది? తాను ఆ హత్య చేయలేదు అని ఎలా నిరూపించుకుంది. అసలు అది ప్రమాదమా? హత్యా? అనేదే మిగిలిన కథ. ఈ మూవీ స్క్రీన్ ప్లే నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. కోర్డులో సీన్ జరుగుతూనే ఉంటుంది. గతంలో ఏం జరిగిందో చూపిస్తూ ఉంటారు. నావల్ స్టైల్ నరేషన్ ఆకట్టుకుంటుంది. మరి.. ఈ అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ మూవీ చూస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి