iDreamPost

దేవుడే రాక్షసుడైతే? OTTలోనే బెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్!

  • Published Jun 17, 2024 | 4:13 PMUpdated Jun 17, 2024 | 4:13 PM

Best Revenge Story In OTT: దాదాపు ఓటీటీ లోకి వచ్చిన అన్ని సినిమాలను మిస్ చేయకుండా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ మధ్య కాలంలో వచ్చినదే మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

Best Revenge Story In OTT: దాదాపు ఓటీటీ లోకి వచ్చిన అన్ని సినిమాలను మిస్ చేయకుండా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ మధ్య కాలంలో వచ్చినదే మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 17, 2024 | 4:13 PMUpdated Jun 17, 2024 | 4:13 PM
దేవుడే రాక్షసుడైతే? OTTలోనే బెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్!

అదేంటో తెలియదు కానీ…థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ సంపాదించుకున్నా కానీ.. ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయా సినిమాల గురించి విపరీతమైన బజ్ వినిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. దాదాపు ఓటీటీ లోకి వచ్చిన అన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ చేయరు. ఈ సినిమాను కూడా ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఒకవేళ మిస్ చేస్తే మాత్రం ఓ డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ రివెంజ్ స్టోరీని మిస్ చేసినట్లే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమాలో హీరో మరెవరో కాదు. పలాస సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ అట్లూరి .. లారీ డ్రైవర్ గా నటించిన చిత్రం “నరకాసుర”. ఈ సినిమాలో అపర్ణ జనార్దన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకు సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్.. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తమిళ్ నాడు సరిహద్దులోని ఓ కాఫీ ఎస్టేట్ నేపధ్యంలో కొనసాగుతోంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో.. నవంబర్ 3న థియేటర్స్ కలో విడుదలైంది. ఆ తర్వాత సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Narakaasura

ఇక నరకాసుర సినిమా కథ విషయానికొస్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన శివ (రక్షిత్).. ఏపీ – తమిళనాడు బోర్డర్ లో ఓ కాఫీ ఎస్టేట్ లో లారీ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. ఆ ఎస్టేట్ ఓనర్, లోకల్ ఎమ్మెల్యే అయినా నాగం నాయుడు అంటే.. ఆయనను ఎవరైనా ఏమైనా అంటే హత్య చేయడానికి కూడా వెనుకాడడు. అలాంటిది.. ఉన్నట్లుండి శివ ఓ రోజు మిస్ అవుతాడు. దింతో శివ కోసం పోలీసులు వెతకడం స్టార్ట్ చేస్తారు. అసలు శివ ఎలా మిస్ అయ్యాడు ! ఎక్కడికి వెళ్ళిపోతాడు ! ఎమ్మెల్యే కుటుంబంతో శివకు ఏదైనా సంబంధం ఉంటుందా ! ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు ! ఊరందరికీ మంచి చేసే శివ.. అసలు కథ ఏంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి . ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి