iDreamPost
android-app
ios-app

OTT Releases: హనుమాన్ తో బోణి.. మార్చిలో OTT జాతరే! ఇన్ని సినిమాల?

  • Published Feb 26, 2024 | 6:04 PMUpdated Feb 26, 2024 | 6:04 PM

ఓటీటీ లకు ఆదరణ పెరిగిపోతున్న క్రమంలో వరుసగా ఎక్కడ చూసిన వరుస సినిమాల జాతరే కనిపిస్తుంది. ఈ క్రమంలో మార్చి నెలలో ఓటీటీ లో సందడి చేయబోయే సినిమాల జాబితా ఇలా ఉంది.

ఓటీటీ లకు ఆదరణ పెరిగిపోతున్న క్రమంలో వరుసగా ఎక్కడ చూసిన వరుస సినిమాల జాతరే కనిపిస్తుంది. ఈ క్రమంలో మార్చి నెలలో ఓటీటీ లో సందడి చేయబోయే సినిమాల జాబితా ఇలా ఉంది.

  • Published Feb 26, 2024 | 6:04 PMUpdated Feb 26, 2024 | 6:04 PM
OTT Releases: హనుమాన్ తో బోణి.. మార్చిలో OTT జాతరే! ఇన్ని సినిమాల?

ఇప్పటివరకు థియేటర్ లో విడుదల అయినా అన్ని సినిమాలు దాదాపు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. కొన్ని సినిమాలైతే థియేటర్ లో రిలీజ్ కాకముందే .. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆయా సినెమాలను భారీ ధరలకు కొనుగోలు చేస్తున్నాయి. ఇక ప్రేక్షకులు కూడా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కు ఎక్కువగా అలవాటు పడడంతో.. ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా పోటా పోటీగా సినిమాలను, సిరీస్ లను.. లాంగ్వేజ్ బారియర్ లేకుండా విడుదల చేస్తున్నాయి. వాటికి లభించే ఆదరణ కూడా అదే విధంగా ఉంది. ఇక రాబోయే మార్చి నెలలో ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలు , సిరీస్ లు ఏ రోజున ఏ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అవుతున్నాయో .. పూర్తి వివరాలను తెలుసుకుందాం.

1)మార్చి2 – జీ5: హనుమాన్
సంక్రాంతి బరిలో బడా హీరోల మధ్యన ఏ మాత్రం బెరుకు లేకుండా.. విడుదలైన ఈ చిన్న బడ్జెట్ సినిమా భారీ విద్వాంసాన్ని సృష్టించి.. ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఆ సమయంలో విడుదలైన అన్ని సినిమాలు ఇప్పటికే ఓటీటీ లలో అడుగుపెట్టగా .. హనుమాన్ మాత్రం ఇప్పుడిపుడే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని. మరికొద్ది రోజుల్లో ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా చాలా మంది.. ఓటీటీ ఎంట్రీ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

2) మార్చి 2- ఈటీవీ విన్: ఈగల్
మాస్ మహారాజ రవితేజ నటించిన ఈగల్ మూవీ .. ఫిబ్రవరి 9న థియేటర్ లో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్యన థియేటర్ లో విడుదలైన ఈ చిత్రం .. మొదటి రోజు మిక్సెడ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ను ఈటీవీ విన్ కొనుగోలు చేసినట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అన్ని ఓకే అయితే మార్చి 2 నుంచి ఈటీవీ విన్ లో ఈగల్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

3)మార్చి 7- సోనీలివ్ : మహారాణి సీజన్ 3
మహారాణి మొదటి రెండు సీజన్లు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న తర్వాత.. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ గా మార్చి 7నుంచి .. మహారాణి సీజన్ 3 .. సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో .. ఈ సిరీస్ మీద భారీ ఎక్స్పెక్టషన్స్ నెలకొన్నాయి.

4) మార్చి 21- నెట్ ఫ్లిక్స్ : ఫైటర్
దీపికా పదుకోన్ , హృతిక్ రోషన్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ “ఫైటర్”. ఈ సినిమా జనవరి 25న ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టకపోయినా.. పాజిటివ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 21నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

5) మార్చి 1- జీ5: సన్‌ఫ్లవర్ సీజన్ 2
అంతకముందు జీ 5వచ్చిన సన్ ఫ్లవర్ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఈ సిరీస్ కు కంటిన్యుషన్ గా సన్ ఫ్లవర్ సీజన్ 2 రాబోతుంది. ఇక ఈ సీజన్ మార్చి 1నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది.

6) మార్చి 8- నెట్‌ఫ్లిక్స్ : మెర్రీ క్రిస్మస్
కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి మిస్టరీ థ్రిల్లర్ మూవీ మెర్రీ క్రిస్మస్ కు.. పాజిటివ్ టాక్ వచ్చినా కూడా.. బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇక ఈ సినిమా మార్చి 8నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) మార్చి 8- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ : షోటైమ్
సరికొత్త కథాంశంతో.. ఈ షో టైం ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెర వెనుక స్టార్ల జీవితం, ఓ సినిమా లేదా సిరీస్ షూటింగ్ ఎలా జరుగుతుంది! బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి వివిధ ఇంట్రెస్టింగ్ అంశాలను ఏ షో టైం ద్వారా ముందుకు తీసుకుని వచ్చారు. మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) మార్చి 21- ప్రైమ్ వీడియో : యే వతన్ మేరే వతన్
సారా అలీ ఖాన్ నటించిన యే వతన్ మేరే వతన్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అవుతోంది. ఈ సినిమాను భారతదేశ స్వతంత్ర సమరయోధురాలు ఉషా మెహతా జీవితాన్ని ఆధారంగా తీసుకుని చిత్రీకరించారు. ఇక ఈ సినిమా మార్చి 21నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

ఇవే కాకుండా మరెన్నో చిత్రాలు, సిరీస్ లు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి . మరి, ఈ మూవీ అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి