iDreamPost

ఆపరేషన్ వాలెంటైన్.. ఓటీటీ డీల్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే..

In that OTT Operation Valentine: మెగాఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీ ఆపరేషన్ వాలెంటైన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

In that OTT Operation Valentine: మెగాఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీ ఆపరేషన్ వాలెంటైన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆపరేషన్ వాలెంటైన్.. ఓటీటీ డీల్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే..

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అద్భుతమైన మార్పులు సంభవించాయి. ఒకప్పుడు ధియేటర్ల ముందు పడిగాపులు కాస్తూ సినిమాలు చూసేవారు.. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త సినిమ నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా తర్వాత చాలా మంది ఓటీటీలోనే సినిమాలు, వెబ్ సీరీస్ చూడటం మొదలు పెట్టారు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.

టాలీవుడ్ లో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘ఆపరేషన్ వాలైంటైన్’ మూవీ మార్చి 1న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కు సంబంధించిన కథాంశంతో ఈ చిత్రం రూపొందించినట్లు తెలుస్తుంది. వైమానిక దాడులు, ఆర్మీ పవర్, దేశ భక్తి కలబోతగా ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్మి నిర్మించారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ.. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్ట్రిమింగ్ పార్ట్‌నర్స్ ప్రైమ్ వీడియో అని మేకర్స్ గతంలో టీజర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి మార్చి 1 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత అమేజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ధియేటర్లో రిలీజ్ అయిన తర్వాత దాదాపు నాలు వారాల తర్వాత తెలుగు తో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానుంది. హిందీలో మాత్రం ఎనిమిది వారాల తర్వాత రిలీజ్ చేయనున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి