iDreamPost
android-app
ios-app

డిగ్రీ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు 60 వేల జీతం

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 60 వేల జీతం పొందొచ్చు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 60 వేల జీతం పొందొచ్చు.

డిగ్రీ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు 60 వేల జీతం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మీరు ఇంజనీరింగ్ డిగ్రీ పాసయ్యారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ పోస్టులు మీకోసమే. ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 60 వేల వరకు జీతం పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి లైఫ్ లో మంచి స్థాయిలో స్థిరపడిపోవచ్చు. తాజాగా హైదరాబాద్ లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 20 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను అనుసరించి అభ్యర్థులు 35 నుంచి 45 ఏళ్ల వయోపరిమితి కలిగి ఉండాలి. దరఖాస్తు ఫీజు 500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు కల్పించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే సీఎంఎం ఇంజినీర్‌ పోస్టుకు రూ.60,000, మిడిల్‌ స్పెషలిస్ట్‌కు రూ.50,000, జూనియర్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు రూ.40,000 అందిస్తారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు: 20

విభాగాల వారీగా ఖాళీలు:

  • సీఎంఎం ఇంజినీర్‌: 04
  • మిడిల్‌ స్పెషలిస్ట్‌: 08
  • జూనియర్‌ స్పెషలిస్ట్‌: 08

అర్హత:

  • టెక్నాలజీ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం:

  • సీఎంఎం ఇంజినీర్‌ పోస్టుకు రూ.60,000, మిడిల్‌ స్పెషలిస్ట్‌కు రూ.50,000, జూనియర్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు రూ.40,000 అందిస్తారు.

వయోపరిమితి:

  • సీఎంఎం ఇంజినీర్‌ పోస్టుకు 45 ఏళ్లు, మిడిల్‌ స్పెషలిస్ట్‌కు 40 ఏళ్లు, జూనియర్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు 35 ఏళ్లు కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

  • షార్ట్‌లిస్ట్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 17-06-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి